ఇచ్చోడ, మార్చి 12 : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకే సీఎం కేసీఆర్ ‘మన ఊరు – మన బడి’ అమలు చేశారని ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ దమ్మ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రభుత్వ యూపీఎస్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. స్థానిక పాఠశాల మన ఊరు – మన బడి పథకం కింద ఎంపికైందన్నారు. పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో సర్పంచ్ చౌహాన్ సునీత, ఎంపీటీసీ నిమ్మల శివకుమార్ రెడ్డి, ఉపసర్పంచ్ లోక శిరీశ్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు రమణ రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ లక్ష్మణ్, వార్డు సభ్యులు భూమయ్య, భీమన్న పాల్గొన్నారు.