దేశ చరిత్రలోనే మంచి బడ్జెట్ ఇది..
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, మార్చి 8 : పట్టణ ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని కోలిపూరలో రూ.25 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు మంగళవారం ఆయన భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దేశ చరిత్రలో అన్ని రాష్ర్టాల కంటె మెరుగైన బడ్జెట్ మనదని అన్నారు. అన్ని వర్గాలు, ప్రాంతాల సమస్యలను తీర్చేలా మన రాష్ట్ర బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, అగ్రికల్చర్ బీఎస్సీ కళాశాల, రిసోర్స్ సెంటర్, ఐటీ టవర్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సొంత జాగ ఉన్నవారికి త్వరలోనే రూ.3 లక్షలతో ఇండ్ల నిర్మాణాలకు అనుమతినిస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు జోగు శైలజ, బండారి సతీశ్, వెంకన్న, వార్డు కమిటీ అధ్యక్షుడు గుండావార్ సంతోష్, మహిళా పట్టణ కార్యదర్శి స్వరూపారాణి పాల్గొన్నారు.
మహిళా సాధికారత దిశగా అడుగులు..
రాష్ట్రంలో మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ వారి గౌరవం పెంచడంతో పాటు మహిళా సాధికారత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణ శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో మూడు రోజులుగా మహిళా బంధు కార్యక్రమా లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా నీటిని అందిస్తూ ఆడవారి బాధలు తీర్చామని తెలిపారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాట్లాడు తూ.. రాష్ట్రంలో మహిళలకు అన్ని రంగాల్లోనూ పెద్దపీట వేస్తున్నామన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తల తయారీకి ప్రత్యేక సబ్సిడీలు ఇస్తున్నామని చెప్పారు. అనంతరం మ హిళలతో కలిసి సంబురాల్లో పాల్గొని స్టెప్పులు వేశారు. వారితో సెల్ఫీలు దిగారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, తాంసి జడ్పీటీసీ రాజు, డీఆర్డీవో కిషన్, యూనిస్ అక్బానీ, కస్తాల ప్రేమల, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.