కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : అంబులెన్స్‌లు ఆపత్కాలంలో భరోసానిస్తున్నాయి. రాత్రీ.. పగలూ తేడాలేకుండా సకాలంలో స్పందిస్తూ తల్లీ బిడ్డలకు ఆయువు పోస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 102 వాహనాలు 43 ఉండగా, ఈ ఏడాది 12,929 (ట్రిప్పులు) సేవలు అందించాయి. అలాగే 108 వాహనాలు 52 ఉండగా, 30,000 సేవలందిం చడంతో పాటు 145 మంది గర్భిణులకు పురుడుపోసి రక్షించాయి.
ఉమ్మడి జిల్లాలో 108 అంబులెన్స్‌లు 52, 102 అంబులెన్స్‌లు 43 ఉన్నాయి. 24 గంటలు అందుబాటులో ఉంటూ అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయి. సమచారం అందుకున్న వెంటనే గర్భిణులను వైద్య పరీక్షల కోసమేగాక ప్రసవం కోసం దవాఖానలకు తీసుకెళ్లి.. తిరిగి ఇళ్లకు చేర్చుతున్నాయి. గర్భందాల్చినప్పటి నుంచి దవాఖాలనకు తీసుకెళ్లడం.. తిరిగి ఇంటికి చేర్చడంలో కీలక ప్రాత పోషిస్తున్నాయి. రాత్రీ.. పగలూ అనే తేడాలేకుండా ఫోన్ వచ్చిన 20 నిమిషాల్లోనే చేరుకొని బాధితులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. 102 అంబులెన్స్‌లు జనవరి నుంచి ఇప్పటి వరకు 12,929 (ట్రిప్పులు) సేవలు అందించగా, 108 అంబులెన్స్‌లు 30 వేల మంది గర్భిణులకు సేవలందించాయి. ఇందులో 108 అంబులెన్స్‌లు అత్యవసర పరిస్థితుల్లోనున్న 145 మంది గర్భిణులకు పురుడుపోసి రక్షించాయి.
108లోనే డెలివరీలు చేస్తున్నాం
గర్భిణులను దవాఖాన లకు తరలించే సమ యంలో పురిటి నొప్పులు ఎక్కువైతే అంబులెన్స్లలోనే ప్రసవాలు చేయాల్సి వస్తోంది. అత్యవసర సమయాల్లో తల్లీ బిడ్డలను కాపాడడం కోసం అంబులెన్స్‌లోనే పురుడు పోసి ఆ తర్వాత దవాఖానకు తరలిస్తున్నాం. ఫోన్లు రాగానే సిబ్బందిని అప్రమత్తం చేసి పంపిస్తున్నాం.
– సతీశ్, ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి
మెరుగైన సేవలు అందిస్తున్నాం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో 108, 102 అంబులెన్స్‌ల ద్వారా గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాము. గర్భిణులు ఫోన్ చేసిన 10-20 నిమిషాల్లోనే అక్కడికి అంబులెన్స్‌లు పంపిస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లో కూడా ఎలాంటి అంతరాయం లేకుండా సేవలు అందిస్తున్నాము. ఈ ఏడాది ఇప్పటి వరకు 108, 102 అంబులెన్స్‌ల ద్వారా 12 వేలకు పైగా సేవలు అందించాము.
– సామ్రాట్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్