ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. మౌలిక వసతుల కల్పన, సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులకు లంచ్ సమయం కావడంతో, వారికి వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. మరింత నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.
– ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 11