ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 9 : ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను క్షుణంగా పరిశీలించాలని తహసీల్దార్ భోజన్న అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్లో బీఎల్వోలు, సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తులను పరిశీలించి తప్పులు లేకుండా పేర్లు నమోదు చేయాలని వారికి సూచించారు. సందేహాలు ఉంటే సంప్రదించాలని అన్నారు. కార్యక్రమంలో సిబ్బంది సద్ధామ్, జామ తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ తిరిగి ఓటరు నమోదు
గుడిహత్నూర్, డిసెంబర్ 9 : మండల కేంద్రంలో తహసీల్ కార్యాలయ సిబ్బంది శుక్రవారం ఇంటింటికీ తిరిగి ఓటరు నమోదు చేపట్టారు. అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మి సూచించారు. ఆమె వెంట జూనియర్ అసిస్టెంట్ కలీం, సిబ్బంది ఉన్నారు.