కాగజ్‌నగర్ టౌన్, నవంబర్ 29 : పాఠశాల దశ నుంచే పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలని కుమ్రంభీం ఆసిఫాబాద్ జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ఫాతిమా కాన్వెంట్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 50వ జిల్లా స్థాయి సైన్స్, గణిత పర్యావరణ ప్రదర్శన,10వ ఇన్స్పైర్ మనక్ జిల్లా స్థాయి ప్రదర్శన, 30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2022-23 ముగింపు కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు సైన్స్‌ఫెయిర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం పేద కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి మంచి ఆవిష్కరణలు చేశారన్నారు. ఆయన గొప్పతనం వల్లే భారత రాష్ట్రపతిగా పని చేసే అవకాశం దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ‘మన ఊరు- మనబడి’ ద్వారా పాఠశాలలను బలోపేతం చేస్తున్నారని పే ర్కొన్నారు.
నాణ్యమైన విద్య, ఇంగ్లిష్ మీడియంలో బోధన, పౌష్టికాహారం, సన్నబియ్యంతో మధ్యాహ్నభోజనం, విద్యాభివృద్ధి పథకాలు వంటి వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన మౌళిక వసతులతో పాటు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందిస్తున్నారని చెప్పారు. వారి కృషి వల్లే ఇంటర్ విద్యలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్‌ను కాగజ్‌నగర్‌లో నిర్వహించడం సంతోషకరమని, విద్యాభివృద్ధి కోసం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆ ధ్వర్యంలో అన్ని విధాలా సహాయ సహకారాలు ఉంటాయ ని పేర్కొన్నారు. జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్ మా ట్లాడుతూ.. సమష్టి కృషి, సహకారంతో జిల్లా సైన్స్ ఎగ్జిబిషన్‌ను విజయవంతం చేశామన్నారు.
జిల్లాలోని వివిధ ప్రభు త్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 854 మంది విద్యార్థులు ప్రదర్శనలు చేశారని, ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయికి పం పించనున్నట్లు చెప్పారు. ఎగ్జిబిషన్ విజయవంతం కావడానికి కలెక్టర్, ఉన్నతాధికారుల సహకారం మరువలేనిదన్నా రు. గైడ్ టీచర్లతో పాటు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వివిధ ప్రదర్శనలు చేసి ప్రతిభ కనబర్చిన విద్యార్థులు, గైడ్ టీచర్లకు బహుమతులు ప్రదానం చేశారు. అంతకుముందు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. డీఈవో అశోక్, ఫాతిమా కాన్వెం ట్ ప్రిన్సిపాల్ సిస్టర్ సాఫల్య, ఎంఈవో భిక్షపతి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
త్వరగా తెలుసుకోవచ్చు
ఆధునిక ప్రపంచంలో శాటిలైట్ ద్వారా బృహత్తరమైన ప్రయోగాలను ప్రపంచదేశాలు తయారు చేసి అంతరిక్షంలో ప్రవేశ పెడుతున్నారు. శాటిలైట్ ద్వారా అక్కడి ఎలాంటి విషయాలనైనా వెంటనే తెలుసుకోవచ్చు.ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తుంది.
– లక్ష్మీప్రణతి, ఫాతిమా కాన్వెంట్, కాగజ్‌నగర్
సులభ పద్ధతిలో గణితం
సులభమైన పద్ధతిలో గణితంలోని లెక్కలు ఎలా చేయవచ్చో ప్రయోగాత్మకంగా చేశాను. నేను ప్రభుత్వ పాఠశాల అంకుశాపూర్‌లో చదువుతున్నా. ఉపాధ్యాయులు చెప్పిన పద్ధతులతో సులభంగా లెక్కలు చేసే విధానాన్ని తయారు చేశా. చతురస్త్రంలో ఎటు చూసినా 90 డిగ్రీల కోణం ఏర్పడుతుంది. ‘ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ జామెంట్రికల్ షేప్స్’ ద్వారా దీనిని తెలుసుకోవచ్చు.
– లక్ష్మణ్, అంకుశాపూర్, ప్రభుత్వ పాఠశాల