చింతలమానెపల్లి, నవంబర్ 25 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ వైస్‌చైర్మన్ కోనేరు కృష్ణారావు సూచించారు. సహకార సంఘం ఆధ్వర్యంలో మండలకేంద్రంతో పాటు రవీంద్రనగర్ -1 గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇక్కడే ధాన్యాన్ని విక్రయించి మద్దతు పొందాలన్నారు. సెంటర్ ఇన్చార్జి అమీర్ హుస్సేన్ మాట్లాడుతూ రైతులు తమ ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, పట్టా పాస్‌బుక్ జిరాక్స్ కాపీలు ఏవో, ఏఈవో ధ్రువీకరించిన పత్రాలను తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు సిద్ధిఖీ, కాగజ్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, వైస్ చైర్మన్ డోకె రాజన్న, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమ్రం మాంతయ్య, ఎంపీపీ డుబ్బుల నానయ్య, జడ్పీటీసీ డుబ్బుల శ్రీదేవి, సహకార సంఘం వైస్ చైర్మన్ టోంబ్రె మారుతి, కో-ఆప్షన్ సభ్యుడు నాజీం హుస్సేన్, ఏఈవో శ్వేత, విజయ్, డైరెక్టర్లు రాపెళ్లి రామయ్య, మహేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు డుబ్బుల వెంకయ్య, ఎంపీటీసీ జాటోత్ ధన్‌రాజ్, సర్పంచ్‌లు, నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీ వైస్ చై ర్మన్ కోనేరు కృష్ణారావు 73 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. తహసీల్ద్దార్ మస్కూర్ అలీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.
సాండ్‌గాం గ్రామంలో..
కౌటాల, నవంబర్ 25 : సాండ్‌గాం గ్రామంలో జడ్పీ వైస్ చై ర్మన్ కోనేరు కృష్ణారావు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, సర్పంచ్ దామోదర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా కో ఆప్షన్ సభ్యడు సిద్ధి ఖీ, ఏపీఎం వెంకట రమణ, ఏఈవోలు శ్రీకన్య, దుర్గభవాని, కార్యదర్శి రాజేశ్వరి, ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.