ఎదులాపురం,నవంబర్ 25: హ్యాండీక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ (హెచ్హెచ్డబ్ల్యుఎస్) ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఏఎస్పీ శ్రీనివాసరావు, డీఆర్డీఏ కిషన్‌తో కలిసి సొసైటీ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సొసైటీ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎలాంటి అవసరం ఉన్నా ముందు ఉం టామని హెచ్చరించారు. అనంతరం దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇమ్రాన్, ప్రధాన కార్యదర్శి ఫైజల్ హైమ్మద్, సయ్యద్ సాజిద్, ఖలీల్ ఉన్నారు.
ప్రత్యేక ఓటరు నమోదు
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు శని, ఆదివారం, డిసెంబర్ 3,4 తేదీల్లో నిర్వహించను న్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ 2023లో భాగంగా ఈ నెల 26,27, డిసెంబర్ 3,4 తేదీలలో నిర్వహించే ప్రత్యేక ఓటరు నమో దు కార్యక్రమంలో 1 జనవరి 2023 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడి పేరును ఓటరుగా నమోదు చేయాలని కోరారు. ప్రత్యేక కార్యక్ర మంలో భాగంగా ప్రతి బూత్ స్థాయి అధికారి సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, తమ పరిధిలోని వయోజనులను ఓటర్‌గా నమోదు చేయాలని సూచించారు.