పోడు పట్టాలకు అర్హులను ఎంపిక చేస్తాం
పోడు భూముల పట్టాలు అందిం చేందుకు అర్హులను ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపిస్తామని బోథ్ డిప్యూటీ రేంజ్ అధికారి ప్రమోద్‌కుమార్ అన్నారు
బోథ్, నవంబర్ 22: పోడు భూముల పట్టాలు అందిం చేందుకు అర్హులను ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపిస్తామని బోథ్ డిప్యూటీ రేంజ్ అధికారి ప్రమోద్‌కుమార్ అన్నారు. మండలంలోని కరత్వాడ, జీడిపల్లెలో మంగళవారం గ్రామసభలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ రేంజ్ అధికారి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పోడు భూముల సర్వే పూర్తి చేస్తామన్నారు. పంచాయతీ తీర్మానాలతో అర్హుల వివరాలను నివేదిస్తామన్నారు. గ్రామసభల్లో సర్పంచ్ దుర్వ సింధు, విశ్వేశ్వర్రావు, ఉప సర్పంచ్ మండాడి మోహన్, ఎఫ్‌బీవో గొడం సుదర్శన్, జీపీ కార్యదర్శి సమ్రీన్, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు ద్యాగల గంగామణి, గ్రామ పటేల్ దుర్వ గంగారాం, ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ధన్నూర్ (బీ)లో నిర్వహించిన సభలో గ్రామస్తులు అటవీ అధికారులకు వినతి పత్రం అందించారు.
గ్రామసభను బహిష్కరించారు.
నేరడిగొండ,నవంబర్ 22 : అర్హులందరికీ పోడు పట్టాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని సర్పంచ్ సోలంకి గీత తెలిపారు. మండలంలోని కిష్టాపూర్‌లో మంగళవారం పోడుభూముల సర్వేపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు లబ్ధి చేకూర్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వే చేయిస్తున్నారని తెలిపారు. అనంతరం పోడు రైతుల జాబితా నివేదికను చదివి వినిపించారు. కార్యక్రమంలో కార్యదర్శి సాయి, ఎఫ్‌బీవో భీంజీ నాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇచ్చోడ(సిరికొండ), నవంబర్ 22 : సిరికొండ, కుంటగూడ, సుంకిడి, కోసు పటేల్‌గూడలో మంగళవారం పోడు భూముల గ్రామ సభలు నిర్వహించారు. అర్హులను ఎంపిక చేస్తూ తీర్మానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గంగారాం, జాదవ్ అనిత, డిప్యూటీ రేంజర్ గీరయ్య, బీట్ ఆఫీసర్ సందీప్, సంతోష్, కార్యదర్శులు అరుణ్, అనిల్, జలపతిరావు, పటేల్ కుమ్రం రావుజీ, కమిటీ సభ్యులు కుమ్రం యాదోరావు, కుమ్రం జంగుబాపు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

