ఎదులాపురం,నవంబర్21: విచ్ఛిన్న శక్తులకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ సంఘం అభ్యున్నతికి పాటుపడడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరగా వారికి ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇందులో సంఘం తాలూకా అధ్యక్షుడు బొమ్మకంటి రమేశ్, గౌరవ అధ్యక్షుడు జక్కుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చిలుక విలాస్, ఉపాధ్యక్షుడు అనుముల ఉశన్న, ఆదిలాబాద్ రూరల్ ప్రధాన కార్యదర్శి తుమ్మరాజు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సంఘం చైతన్యం కోసం పాటుపడుతూ అభివృద్ధి దిశలో ముందుకెళ్లాలని సూచించారు. పద్మశాలీల సంఘ భవనం కోసం రూ.15లక్షలు కేటాయించామని, అదనంగా రూ.కోటి ఖర్చు చేసి అన్ని వసతులు కల్పించి సంఘం భవనాన్ని ప్రారంభించిన్నట్లు తెలిపారు. సంఘం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అలాల్ అజయ్, ఆత్మ కమిటీ చైర్మన్ జిట్ట రమేశ్, జైనథ్ ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, బీసీ పట్టణ అధ్యక్షుడు దాసరి రమేశ్, మోరా విఠల్, ఆత్మ కమిటీ డైరెక్టర్ మోరా ఆశన్న పాల్గొన్నారు.
అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న వద్ద పీఏగా విధులు నిర్వహిస్తున్న అనిల్‌కుమార్ తండ్రి రాజన్న సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసు కున్న ఎమ్మెల్యే రామన్న జిల్లా కేంద్రంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి అనిల్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇంటి వద్ద నుంచి గడియాల్ శ్మశానఘాట్ వరకు నిర్వహించిన అంతిమ యాత్రకు వెళ్లి సంతాపాన్ని ప్రకటిం చా రు. ఎమ్మెల్యే వెంట జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పట్టణాధ్యక్షుడు అజయ్,సీపీఎం నాయకులు లంక రాఘవులు, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు భూమన్న, ప్రధాన కార్యదర్శి అశోక్ ఉన్నారు.