ఉట్నూర్/ఉట్నూర్ రూరల్, నవంబర్ 12 : యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లాల్టెక్డీ గురుకుల జూనియర్ కళాశాల ప్రాంగణంలో శనివారం నిర్వహించిన 6వ రాష్ట్ర స్థాయి గురు కుల క్రీడా పోటీలను వారు ప్రారంభించారు. ముందుగా క్రీడాకారుల గౌరవ వందనం స్వీక రించి జాతీయ జెండాను ఎగురవేశారు. అనం తరం క్రీడాజ్యోతిని వెలిగించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. పేద గిరిజన విద్యార్థులకు మెరు గైన విద్యా బోధన అందిస్తున్నదని తెలిపా రు.
గురుకులాల్లో చదివిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. క్రీడాకారులకు తన వంతుగా రూ.లక్షతో క్రీడాసామగ్రి అంది స్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఐటీడీఏ పీవో మాట్లాడుతూ క్రీడలు మానసిక ఒత్తిడిని దూరం చేసి శారీరకంగా ఆరోగ్యవంతులను చేస్తాయ న్నారు. క్రీడల ద్వారా గెలుపోటములను సమా నంగా స్వీకరించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం జోన్-2, 3 జట్ల మధ్య కబడ్డీ పోటీలను ప్రారంభించారు.
ఈ క్రీడా పోటీలు ఈ నెల 12, 13, 14, 15 రోజుల పాటు జరుగ నున్నాయి. క్రీడా పోటీల్లో జోన్ -1 ఆదిలాబాద్, మెదక్, జోన్ -2 కరీంనగర్, జయశంకర్ భూపా లపల్లి, జోన్-3 నల్గొండ, ఖమ్మం, జోన్- 4 మహబూబ్ నగర్, రంగారెడ్డి నుంచి 1200 మంది క్రీడాకారులు ఎస్కార్ట్ సిబ్బంది, వ్యాయా మ, క్రీడా ఉపాధ్యాయులు వచ్చారు. ఖోఖో, కబడ్డీ, బాక్సింగ్, వాలీబాల్, హ్యాండ్బాల్, చెస్, ఫుట్బాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించను న్నా రు.
గురుకుల సంయుక్త కార్యదర్శి విజయ లక్ష్మి, రీజినల్ కో ఆర్డినేటర్ లక్ష్మయ్య, ఆర్సీవో గంగా ధర్, ఈడీ రవి కుమార్, సర్పంచ్ హరి నాయక్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాం జాదవ్, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అజీమొ ద్దీన్, ఎంపీటీసీ శారద, ప్రిన్సిపాల్ రామ్మోహన్, శ్రీనివాస స్వామి, మారుతి శర్మ, హృషికేశ్, రమేశ్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, జయం, టీఆర్ఎస్ (బీఆర్ ఎస్) మండలాధ్యక్షడు కందుకూరి రమేశ్, అన్సారీ, పోశన్న, నాయకులు పాల్గొన్నారు.