ఉట్నూర్, మార్చి1: పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రత్యేక ప్ర ణాళిక అమలు చేయనున్నట్లు ఐటీడీఏ పీవో అం కిత్ తెలిపారు. ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయంలో విద్యావిభాగం అధికారులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క మిషనర్, గిరిజన సంక్షేమశాఖ హైదరాబాద్ నుం చి ప్రణాళిక అమలు చేసే విధానంపై శ్రీమతి చం దన సర్వే ప్రణాళిక అమలుపై డీడీటీడబ్ల్యూ, ఏసీఎంవో,ఏటీడీవోలతో చర్చించి ప్రత్యేక సూచనలు చేశారు. అనంతరం పీవో అంకిత్ మాట్లాడు తూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,493 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారని, ఆదిలాబాద్‌లో 2,112, ఆసిఫాబాద్‌లో 1,365, నిర్మల్ లో 495, మంచిర్యాలలో 519 మంది విద్యార్థు లు ఉన్నట్లు వెల్లడించారు. వార్షిక పరీక్షకు పదో తరగతి విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు 60 రోజుల ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఇందులో నిత్యం స్లీప్ టెస్టుల నిర్వహణ, ప్రత్యేక తరగతుల నిర్వహణ, కేటగిరి వారీగా విభజించి వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ, తదితర అంశాలను వివరించారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతే ధ్యేయంగా ఉపాధ్యాయులు కృషి చేయాల్సి ఉంటుందని తె లిపారు. హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం డీడీ సంధ్యరాణి, ఏసీఎంవో జగన్, ఏటీడీవోలు భాస్కర్, సౌజన్య, క్రాంతి పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఐటీడీ ఏ పీవో అంకిత్ సిబ్బందికి సూచించారు. ఉట్నూర్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మి కం గా మంగళవారం తనిఖీ చేశారు. పరిసర ప్రాం తాలు, గదులు పరిశీలించారు. మంత్రుల పర్యట న నేపథ్యంలో దవాఖానను సందర్శించారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ సేవలు అందించాలన్నారు. దవాఖాన సూపరింటెండెం ట్ ఉపేందర్, వైద్యుడు మహేందర్, సిబ్బంది, తదితరులున్నారు.