ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భిన్న వాతావరణం నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 39 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుంటే.. రాత్రి టెంపరేచర్ 19 డిగ్రీలుగా ఉంటుంది. పగలు ఉక్కపోస్తుండగా.. రాత్రి చలి పెడుతున్నది. నైరుతి రుతుపవనాలు తిరోగమనం పట్టగా.. కొండ ప్రాంతాలు మంచుతో కమ్మేయబడి ఉంటున్నాయి. కొన్ని చోట్ల వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణం చేస్తున్నారు. – ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్, అక్టోబర్ 12