ముథోల్, సెప్టెంబర్ 25 : తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పండుగను సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని సూచించారు.
మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నదన్నారు. మహిళా సమాఖ్యలకు వీవో బిల్డింగ్స్ అందుబాటులో వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆయేషా అప్రోజ్ ఖాన్, సర్పంచ్ రాజేందర్, రైతు బంధు సమితి అధ్యక్షుడు రాంరెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు రోళ్ల రమేశ్, మాజీఎంపీటీసీ పోతన్న యాదవ్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, కోఆప్షన్ సభ్యుడు మగ్దూర్, ఎస్ఐ తిరుపతి ఉన్నారు.
లోకేశ్వరం, సెప్టెంబర్ 25 : మండల కేంద్రం లో రైతు వేదికలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని అందరూ కలిసి సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
రానున్న రోజు ల్లో ముఖ్యమంత్రి కేసీఆర్కు అందరూ అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ లలితా భోజన్న, ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, సింగిల్ విండో చైర్మన్ సిరిపురం రత్నాకర్ రావు, పలువురు అధికారులు, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ రావు, గడిగె రవి, నాలం గంగయ్య, సోషల్ మీడియా కన్వీనర్ బండి ప్రశాంత్, ఐకేపీ ఏపీఎం మల్లేశ్, ఐకేపీ సిబ్బంది, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.