ఎదులాపురం, ఆగస్టు 20 : హైదరాబాద్లో ఈ నెల 22వ తేదీన నిర్వహించే స్వతంత్ర భారత వ జ్రోత్సవ ముగింపు కార్యక్రమానికి జిల్లా నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లాలని ఆ దిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చా రు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు బస్సుల్లో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారు లు, పీఏసీఎస్ చైర్మన్లు, రైతు బంధు సమితి సభ్యులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మ న్లు, తదితరులను తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేయాలన్నారు.
22న ఉదయం 6 గంటలకు జిల్లా కేం ద్రం నుంచి బస్సులు బయల్దేరాలని సూచించా రు. తాగునీరు, భోజన సౌకర్యా లు సమకూర్చాలన్నారు. హైదరాబాద్ వెళ్లే వారికి గుర్తింపు కార్డులను అందజేయాలన్నా రు. అదనపు కలెక్టర్లు రి జ్వాన్ బాషా షేక్, నటరాజ్, ఆర్డీవో రాథోడ్ రమే శ్, జడ్పీ సీఈ వో గణపతి, డీఆర్డీఏ కిషన్, డీఈ వో ప్రణీత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్ల య్య, పౌరసరఫరాల అధికారులు సుదర్శన్, భీం కుమార్, ఎంవీఐ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శైలజ, తదితరులు పాల్గొన్నారు.