బోథ్, ఆగస్టు 20 : మండలంలోని కౌఠ (బీ) గ్రామంలోని శబరి మాతాజీ ఆశ్రమంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో మహిళలు ఊయల కట్టారు. అర్ధరాత్రి కృష్ణుడు పుట్టిన సమయంలో తయారు చేసిన మట్టి బొమ్మను ఊయలలో పడుకోబెట్టి పాటలు పాడారు. కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, ధర్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, దిగంబర్, రవీందర్‌రెడ్డి, వీరేశం, బాపురెడ్డి, గీత, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
తాంసి, ఆగస్టు 20 : మండలంలోని కప్పర్ల, పొన్నారి, సవర్గాం, బండలనాగాపూర్, అంబుగాం గ్రామాల్లో శ్రీ కృష్ణష్టామి వేడుకలు నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో పల్లకీ పూజలు చేసి భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. చిన్నికృష్ణుల చేత దహేండి కార్యక్రమం నిర్వహించారు. పొన్నారి గ్రామంలోని మురళీకృష్ణ ఆలయంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ సురుకుంటి మంజులాశ్రీధర్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఎదులాపురం, ఆగస్టు 20 : ఆదిలాబాద్‌లోని సుందరయ్యనగర్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు కృష్ణుడు, గోపిక వేషధారణలో ఆకట్టుకున్నారు. అంగన్వాడీ కార్యకర్త రాధ, తదితరులు పాల్గొన్నారు.