ఎదులాపురం, ఆగస్టు 20 : భగవద్గీత ప్రపంచ దేశాల మన్నన పొందిందని , గీతాచార్యుడైన శ్రీ కృష్ణుడు విశ్వగురువని సాయివైకుంఠ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ హోమియోవైద్యుడు కాడిగిరి రవికిరణ్యాదవ్ ఉద్బోధించారు. ఆదిలాబాద్‌లోని యాదవ సంఘ భవనంలో సంఘం, సాయివైకుంఠట్రస్ట్ సౌజన్యంతో శనివారం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. దాదాపు 8వేల మందితో కలిసి పట్టణంలో కృష్ణుడి ఉత్సవమూర్తితో శోభాయాత్ర, ఒగ్గు ప్రదర్శన, మహిళల కోలాటాలు, సాంస్కృతిక, ఉట్టికొట్టే కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా పూజలు చేశారు.
ఈ సందర్భంగా రవికిరణ్యాదవ్ మాట్లాడుతూ కృష్ణుడు ఉపదేశించిన కర్మసూత్రం అవలంబిస్తే ఫలితం వస్తుందన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో యాదవులకు గొర్రెలు అందాయని, బీసీలందరికీ మహాత్మా జ్యోతి బాఫూలే గురుకులాలతో మేలు జరుగుతుందన్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ తన పరిధిలో యాదవులు, బీసీలకు రుణవితరణలో సహకరిస్తానని తెలిపారు.
కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావ్, నర్సింగ్, సుహాసిని, పాయల శంకర్, యా దవ సంఘం జిల్లా అధ్యక్షుడు కాడిగిరి రఘువీర్‌యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గొర్ల రాజు యాదవ్, అసుర హన్మాండ్లు యాదవ్, సురేందర్, నవీన్, నరేందర్, సల్ల విజయబాబు , సంతో ష్, మహేందర్, కపిల్, వేణు, ఆశన్న, మల్లయ్య, జగదీశ్, శ్రీనివాస్, పురుషోత్తం, కరణాకర్ రెడ్డి, కావటి రమేశ్, యాదవులు పాల్గొన్నారు.