ఖానాపూర్ టౌన్, జూన్ 20 : తెలంగాణ సర్కారు ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పే ర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పా ఠశాలలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమాన్ని స్థాని క ప్రజా ప్రతినిధులతో కలిసి సోమవారం ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో తరగతి గదులను పరిశీలించారు.
పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశా రు. ప్రభుత్వం పాఠశాలల్లో అదనపు గదులు, టాయిలెట్స్, వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.29 లక్షలు మం జూరు చేసిందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలవైపు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఏఎంసీ వైస్ చైర్మన్ గొర్రె గంగాధర్, ఎంఈవో మధుసూదన్, బాలికల పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఖానాపూర్ రూరల్, జూన్ 20 : ‘మన ఊరు-మనబడి’తో ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు సమకూరుతాయని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. మండలంలోని రాజురా, బీర్నంది గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. రాష్ట్రంలో కేజీ టూ పీజీ వరకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందిస్తున్నామన్నారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప సత్యనారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ వాల్సింగ్, గ్రామసర్పంచ్లు సాగి సువర్ణ, లక్ష్మణ్ రావు, చిన్నం లావణ్య, రవి, కొడారి గోపాల్, నాయకులు రాజగంగన్న, పత్రి శ్రీనివాస్, గుమ్ముల లింగన్న, సంజీవ్, పెద్ది రాజు, షాకీర్, నిమ్యనాయక్, పత్రి నగేశ్, ఎంఈవో మధుసూదన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
దస్తురాబాద్, జూన్ 20 : మండలంలోని మున్యాల తండాలో ఎమ్మెల్యే రేఖా నాయక్ పర్యటించారు. గ్రా మానికి చెందిన గంగ నాయక్ కుమారుడు వినోద్ వి వాహ విందుకు హాజరై దంపతులను ఆశీర్వదించారు. ఏఆర్ఎస్ కానుక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పలువురిని పలుకరించి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఎం పీపీ సింగరి కిషన్, వైస్ ఎంపీపీ భూక్యా రాజునాయక్, సర్పంచ్ నాగావత్ సురేశ్ నాయక్, నాయకులున్నారు.