బెల్లంపల్లిరూరల్, జూన్ 17: గ్రామాల్లో పారిశుధ్య పనులపై నిర్లక్ష్యం చేయవద్దని పంచాయతీ అధికారులు, సిబ్బందికి మంచిర్యాల అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ సూచించారు. శుక్రవారం బెల్లంపల్లి మండలంలోని చంద్రవెళ్లిలో ఆయన పర్యటించారు. మంచినీటి ట్యాంకును పరిశీలించారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ అశోక్‌గౌడ్, సిబ్బందికి సూచించారు. అన్ని వార్డుల్లో పారిశుధ్య పనులు పరిశీలించారు. మురుగు కాలువలు పూడిక తీయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బూదాకలన్లో మురుగు కాలువల్లో చెత్త ఉండడంతో సర్పంచ్ కోట లక్ష్మి, పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు గ్రామంలోని అన్ని కాలువలను శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో డీ రాజేందర్, ఎంపీవో వీ శ్రీనివాస్, ఏపీవో జీనత్, ఏపీఎం శ్యామల, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కాసిపేట, జూన్ 17 : సోమగూడెం(కే) గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణం, పారిశుధ్య పనులను, పల్లె ప్రకృతి వనం, డంప్ యార్డ్, శ్మశాన వాటిక, నర్సరీని అదనపు కలెక్టర్ మధుసూదన్ పరిశీలించారు. బయో ఫెన్సింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. క్రీడా ప్రాంగణంలో స్తంభాల ఏర్పాటు, ప్లాంటేషన్ చేయాలని సూచించారు. కాసిపేటలో క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించి పనులు పూర్తి చేయాలని సూచించారు. ముత్యంపల్లిలో పారిశుధ్య పనులను, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. పల్లంగూడలో పాఠశాల ప్రహరీ మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో ఎంఏ అలీం, తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎంపీవో నాగరాజు, సర్పంచ్‌లు ఆడె బాదు, సపాట్ శంకర్, ధరావత్ దేవి, దుస్స విజయ, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, కార్యదర్శులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి టౌన్, జూన్ 17 : మున్సిపాలిటీలో 28వ వార్డులో పట్టణ ప్రగతి పనులను అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ పరిశీలించి, పలు సూచనలు చేశారు. 27వ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, ఏఈ సందీప్, టీవో ఆశ్రిత్, విద్యుత్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
మందమర్రి జూన్ 17: మందమర్రి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి పనులను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పరిశీలించారు. పారిశుధ్యం, సెగ్రిగేషన్ షెడ్, క్రీడా ప్రాంగణం తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, ఏఈ అచ్యుత్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, 22వ వార్డు ప్రత్యేక అధికారి సొహెలొద్దీన్, టీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు రవివర్మ, సమన్వయ కర్త అంతడుపుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లి, జూన్ 17 : గ్రామాలను ప్రగతి పథంలో నడిపించి, ఆదర్శనీయంగా తీర్చిదిద్దాలని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు సూచించారు. కోటపల్లి మండలంలోని జనగామలో డీపీవో గురువారం రాత్రి పల్లె నిద్ర చేసిన అనంతరం గ్రామంలో పర్యటించారు. పారిశుధ్య కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు గ్రామస్తులు సహకరించాలని సూచించారు. నర్సరీ నిర్వహ ణ, మొక్కల సంరక్షణపై సర్పంచ్ గట్టు లక్ష్మణ్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డిని అభినందించారు. అనంతరం ఆలుగామ, రొయ్యలపల్లి, సిర్సా, లింగన్నపేటలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. సిర్సా గ్రామంలో సర్పంచ్ పెద్దింటి పున్నంచంద్, పంచాయతీ కార్యదర్శి సరిగమల సదయ్య ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు కుమ్మరి సంతోష్, ఓంకారి రజిత, దాగమ రాజు, పంచాయతీ కార్యదర్శులు రాజన్న, శ్రీవిద్య, శిల్పాచారి తదితరులు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట, జూన్ 17 : ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్లో తప్పకుండా మొక్కలు నాటాలని లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య సూచించారు. పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో శుక్రవారం నాలుగో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డుల్లోని పలు వీధుల్లో మొక్కలు నాటారు. అనంతరం కాలనీ వాసులకు హరితహారం పారిశుధ్యం, పర్యావరణంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషర్ వెంకటేశ్, కో ఆప్షన్ సభ్యుడు నూనె ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది, కాలనీ వాసులున్నారు.
తాండూర్, జూన్ 17 : నర్సరీల్లో మొక్కల పెంపకంపై నర్సరీల నిర్వాహకులు, అధికారులు జాగ్రత్తలు పాటించాలని మంచిర్యాల జడ్పీ డిఫ్యూటీ సీఈవో లక్ష్మీనారాయణ అన్నా రు. మండలంలోని కిష్టంపేటలో నర్సరీని పరిశీలించారు. హరితహారానికి మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎంపీవో సత్యనారాయణ, కార్యదర్శి చంద్రమౌళి, తదితరులున్నారు.
వేమనపల్లి, జూన్ 17 : పల్లె ప్రగతి పనులను పకడ్బందీగా చేపట్టాలని జడ్పీ సీఈవో నరేందర్ పేర్కొన్నారు. మండలంలోని రాజారాం గ్రామంలో పల్లెప్రకృతి వనాలు, పారిశుధ్య పనులు, క్రీడా మైదానాల పనులను పరిశీలించారు. పారిశుధ్య, క్రీడా మైదానాలు, నర్సరీలు, ప్రకృతి వనాలు, హరితహారంపై సూచనలు చేశారు. అనంతరం వేమనపల్లి ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. గ్రామ స్వరాజ్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మయ్య, ఎంపీవో శ్రీపతి బాపురావు, సర్పంచ్ కుబిడె మధుకర్, పంచాయతీ కార్యదర్శులు శ్యాం, పోచం, సీనియర్ సహాయకులు లక్ష్మీనారాయణ ఉన్నారు.
సీసీసీ నస్పూర్, జూన్ 17: నస్పూర్ మున్సిపాలిటీలో 24, 25వ వార్డుల్లో శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలోని ఆయా వాడల్లో క్రీడా ప్రాంగణాలు, పచ్చదనం, క్లీన్‌అండ్‌గ్రీన్, విద్యుత్, డ్రైనేజీ, తదితర సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. అనంతరం గోదావరి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పార్కులో మొక్కలు నా టారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మర్రి మొగిళి, కుర్మిళ్ల అన్నపూర్ణ, కమిషనర్ రాజలింగు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి మేరుగు పవన్‌కుమార్, నాయకులు జక్కుల రాజేశం, బండారి తిరుపతి, వడ్లకొండ రవి, శెట్టి రమణ, దుబ్బాగౌడ్, చిలుముల పోశం, వెంకటేశ్, సత్యనారాయణ, కలకోట సదానందం, దొంకటి రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్ రూరల్, జూన్ 17: మండలంలోని కొమ్మెర, నాగాపూర్, ఆస్నాద్, ముత్తరావుపల్లి, కిష్టంపేట గ్రామాలలో పల్లె ప్రగతి పనులు ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. పారిశుధ్యం, విద్యుత్ సమస్యలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అన్నల మానస, అయిత పార్వతి, బుర్ర రాకేశ్ గౌడ్ నాయకులు అన్నల తిరుపతి, అయిత సురేశ్ రెడ్డి, సెక్రటరీలు భాస్కర్, సత్యనారాయణ, మౌనిక, గ్రామస్తులు పాల్గొన్నారు.