దస్తురాబాద్, జూన్ 17 : హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు కోరారు. మున్యాల తండా పంచాయతీలోని ఇందిరమ్మ కాలనీలో సర్పంచ్ నాగవత్ సురేశ్ నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం హరితహారం నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దుర్గం సునీత- రాజలింగం, ఎస్ఐ జ్యోతిమణి, ఎంపీవో అనిల్ కుమార్,ఆర్ఐ గంగన్న, డిప్యూటీ సర్వేయర్ శ్రీనివాస్ రావు, ఎఫ్బీవో లక్ష్మీనర్సయ్య, కార్యదర్శి శివ కృష్ణ ,అంగన్వాడీ టీచర్ సరోజ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమం కొనసాగుతున్నది. ఆకొండపేటలో హరితహారం నిర్వహణకు గ్రామ ప్రత్యేక అధికారి,ఆర్ఐ వెంకట న నర్సయ్య ఆధ్వర్యంలో గుంతలు తవ్వించారు. కార్యక్రమంలో సర్పంచ్, కార్యదర్శి తదితరులున్నారు.
మామడ,జూన్17 : గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఈవో దుర్గం శంకర్ అన్నారు. మండలంలోని పొన్కల్లో క్రీడా మైదానం, ఎవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, సెగ్రిగేషన్ షెడ్డును పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం,క్రీడామైదానాన్ని అందంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మల్లేశం, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణారెడ్డి, సిబ్బంది ఉన్నారు.
లక్ష్మణచాంద, జూన్ 17 : మండల కేంద్రంలో శుక్రవారం ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ అడ్వాల పద్మ, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్ మొక్కలు నాటారు. బడిబాట కార్యక్రమంపై ఆరా తీశారు. అనంతరం గ్రామంలో చేపడుతున్న పారిశుధ్య పనులు, అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ సురకంటి ముత్యంరెడ్డి, ఎంపీడీవో శేఖర్, ఎంపీవో నసీరొద్దీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఖానాపూర్ రూరల్, జూన్ 17: మండలంలోని రాజురాలో సర్పంచ్ లావణ్య ఆధ్వర్యంలో పల్లె ప్రగతి నిర్వహించారు. బావుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి మదన్మోహన్, నాయకులు చిన్నం రవి, గుమ్ముల లింగన్న, వేణు, పెద్దరాజు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కడెం, జూన్ 17: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఉడుంపూర్లో సర్పంచ్ కుర్ర లక్ష్మి-లక్ష్మణ్ ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైడే- ఫ్రైడే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి రాకేశ్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూత తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. బాలింతలు, గర్భిణులు,చిన్నారులకు అందజేస్తున్న పౌష్టికాహారం,ఆరోగ్య లక్ష్మి భోజనంపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు గంగామణి, రత్నమాల, అంగన్వాడీ టీచర్ అనిత, ఆశ కార్యకర్త లలిత, కారోబార్ రాజయ్య ఉన్నారు.