జైనథ్, జూన్ 17 : మండలంలో వీలైనన్ని మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మండలంలోని నిరాల, లేకర్వాడ, పెండల్వాడ, బాలాపూర్ గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. సెగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, డంప్‌యార్డులు, హరితహారం నర్సరీలు, పెండల్వాడలో అంగన్వాడీ కేంద్రం, సబ్‌సెంటర్, పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా నిరాల నుంచి పెండల్వాడ, కౌట వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, జడ్పీటీసీ తుమ్మల అరుంధతి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ రాఘవేంద్రరావు, ఎంపీడీవో గజానన్‌రావు, ఎంపీవో వెంకటరాజు, సర్పంచ్‌లు సునందాప్రభాకర్, వినోద్ యాదవ్, మమతావిఠల్, ఎంపీటీసీ అశోక్, నాయకులు సురేశ్ పాల్గొన్నారు.
ఇచ్చోడ, జూన్ 17 : మండలంలోని ముక్రా(బీ), దేవుల్నాయక్తండా, జామిడి, గేర్జం గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను జడ్పీ సీఈవో గణపతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు స్థలాలను త్వరలో ఎంపిక చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురుగు కాల్వలను శుభ్రం చేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు అడవ్ మారుతి, హరన్ సుభాష్, కనక విజయలక్ష్మి, రాథోడ్ భీంబాయి, ఎంపీడీవో రాంప్రసాద్, ఎంపీవో నరేందర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
బోథ్, జూన్ 17: గ్రామాల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని ఎంపీడీవో దుర్గం రాజేశ్వర్ సూచించారు. పల్లె ప్రగతిలో భాగంగా ధన్నూర్(బీ), బిర్లగొంది, కోటా(కే), సాంగ్వి గ్రామాల్లో ఆయన పర్యటించారు. సాంగ్విలో క్రీడా ప్రాంగణం కోసం స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమాల్లో మండల పంచాయతీ అధికారి జీవన్‌రెడ్డి, ఈజీఎస్ ఏపీవో జగ్దేరావ్, సర్పంచ్‌లు గంగాధర్, పంతాబాయి, పేష్వే పూజ, ఎంపీటీసీ నారాయణరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జూన్ 17: మండలంలోని తుమ్మగూడ గ్రామంలో పల్లె ప్రకతి వనం, నర్సరీలోని మొక్కలు, కంపోస్ట్ షెడ్డు, పాఠశాలను ఎంపీవో సంతోష్ పరిశీలించారు. హరితహారం కోసం అన్ని రకాల మొక్కలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు విన్నవించిన సమస్యలు శాఖల వారీగా పరిష్కరించాలన్నారు. ఆయన వెంట సర్పంచ్ మడావి శేఖు, పంచాయతీ అధికారులు ఉన్నారు.
తాంసి, జూన్ 17: మండలంలోని తాంసి, హస్నాపూర్, పొన్నారి, కప్పర్ల గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను ఎంపీడీవో ఆకుల భూమయ్య పరిశీలించారు. ప్రజాప్రతినిధులతో కలిసి డ్రైడే సందర్భంగా మొక్కలకు నీరు పోశారు. అనంతరం గ్రామాల్లోని వీధులు, మురుగుకాల్వలను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీదేవి, సర్పంచ్‌లు కృష్ణ, సదానందం, వెంకన్న, శ్రీనివాస్, కేశవ్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, ఎంపీటీసీలు రేఖ, అశోక్, నరేశ్, భాగ్యవతి, ఎంపీవో సుధీర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
ఉట్నూర్ రూరల్, జూన్ 17: పల్లె ప్రగతి పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రత్యేక అధికారి కనక భీంరావ్ సూచించారు. మండలంలోని లక్కారం గ్రామ పంచాయతీ పరిధిలోని బాయమ్మకుంట, గంగన్నపేట చెరువులను పరిశీలించారు. తూములు, కాల్వలు, మత్తడి పనులు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాథోడ్ జనార్దన్, ఉప సర్పంచ్ కోల సత్తన్న పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జూన్ 17 : పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపడుతున్నారు. ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ కోరెంగా గాంధారి ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా మురుగు కాల్వల్లోని చెత్త, పూడికను తొలగించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోరెంగా సుంకట్రావ్, ఈవో సంజీవ్‌రావ్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.