బేల, జూన్ 17 : కేంద్ర ప్రభుత్వ సహకరించకపోయినా సీఎం కేసీఆర్ సారథ్యంలో సంక్షేమ పాలన అందిస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బేల మండలంలోని టా క్లి, శంషాబాద్, పోనాల గ్రామాలకు చెందిన ఏడుగురు దళితబంధు లబ్ధిదారులకు శుక్రవారం వా హనాలను అందజేశారు. అనంతరం వరూర్లో సవారీ బంగ్లా షెడ్డు నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అలాగే ఎస్టీ కమ్యూనిటీ షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టారన్నారు.
70 ఏండ్లు పాలించిన కాం గ్రెస్, బీజేపీలు దళితులను కేవలం ఓటు కోసమే వినియోగించుకున్నారని విమర్శించారు. ఈ సారి ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాలని వారికి సూ చించారు. టీఆర్ఎస్ సర్కారు ప్రతి కుటుంబానికీ లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అ మలు చేస్తున్నట్లు చెప్పారు. బీజేపీ నాయకులు చె ప్పే మోస పూరిత మాటలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. పల్లె, పట్టణ ప్రగతి ద్వారా గ్రా మాలను సుందరంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కే సీఆర్దే అని అన్నారు.
ప్రజలకు విద్య, వైద్యంతో పాటు యువత క్రీడల్లో రాణించేలా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మన ఊ రు-మన బడి ద్వారా రూ.7,700 కోట్లు వె చ్చించి, మూడో విడుతల్లో మౌలిక వసతులు క ల్పించనున్నట్లు తెలిపారు. అన్ని కులాలను గౌరవిస్తూ ప్రతి గ్రామంలో మందిరాలు, సవారీ బం గ్లా షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజానీకానికి అనుగుణంగా పాలన కొనసాగుతున్నదన్నా రు. నూతన గ్రామ పంచాయతీల్లో రూ.25 లక్షలతో త్వరలోనే భవనాలు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు.
పాఠన్ గ్రామంలో పోచమ్మ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాధ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఎంపీడీవో భగత్ రవీందర్, టీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రె, సతీశ్ పవర్, ప్రమోద్‌రెడ్డి, జక్కుల మధూకర్, తన్వీర్‌ఖాన్, ఇంద్రశేఖర్, బండి సుదర్శన్, మంగేశ్ ఠాక్రె, ఎంపీటీసీ అరున్, స్థానిక సర్పంచ్ తుకారం, పైజూల్లా ఖాన్, రాము, పీఆర్ఏఈ హరీశ్, ఐటీడీఏ ఏఈ సుధాకర్ ఆయా గ్రామాల నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు.