ఈనెల 26వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని నిర్మల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ పేర్కొన్నారు. గురువారం న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీకి తగిన కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.
ఎదులాపురం, జూన్ 16 : ఈ నెల 26న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. ఆదిలాబాద్‌లోని కోర్టు సమావేశ మందిరంలో వివిధ బీమా సంస్థల ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించిన కేసులు పై కోర్టులో అప్పీల్ చేసేందుకు వీలు ఉండదన్నారు. రాజీమార్గంలో కేసులు పరిష్కారమయ్యే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రాజీకి అనువైన కేసుల దర్యాప్తును వెంటనే పూ ర్తి చేసి తుది నివేదికను న్యాయస్థానంలో అందించాలని ఆదేశించారు. సమావేశంలో న్యాయమూర్తులు మాధవికృష్ణ, ఉదయ్ భాస్కర్‌రావు, డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్ పాండే , బార్ అసోసియేషన్ చైర్మన్ ఎర్రల నగేశ్, వివిధ బీమా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.