నెన్నెల, జూన్ 11: మారుమూల గ్రామాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. శనివారం నెన్నెల మండలంలోని చిత్తాపూర్ జెండావెంకటాపూర్ గ్రామాల మధ్య ఉన్న మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా మార్చేందుకు ఐటీడీఏ నుంచి రూ.78 లక్షల నిధులను మంజూరు చేయించి కొబ్బరి కాయ కొట్టి పనులు ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి గ్రామానికీ రోడ్డు, ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్డు, బ్రిడ్జిలు నిర్మించినట్లు తెలిపారు.
ఓ వైపు వరి సాగు చేయాలని బీజేపీ నాయకులు చెప్పారని, మరో వైపు వరి ధాన్యం కొనుగోలులో బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రైతులను ముంచడానికి యత్నించిందన్నారు. రైతులు నష్టపోకుండా సీఎం కేసీఆర్ ముందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. మద్దతు ధర అందించి రై తులను ఆదుకున్నారని కొనియాడారు. పంట పెట్టుబడికి రైతుబంధు, రైతు మరణిస్తే కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతు బీమా ద్వారా రూ. 5 లక్షలు అందించి ఆదుకుటున్నట్లు తెలిపారు.
ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న ఘనత రాష్ర్టానికే దక్కిందన్నారు. ప్రతి పేదవాడికీ ఇల్లు జాగా ఉంటే చాలు రూ.3 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ఎన్నికలప్పుడు వచ్చి లేనిపోని కథలు, అబద్ధాలు చెప్పి ప్రజలను నట్టేట ముంచే వారి మాటలు నమ్మ వద్దన్నారు. మీ కష్టాలను తీరుస్తూ, అండగా ఉన్నవారినే గెలిపి ంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంతోసం రమాదేవి, జడ్పీటీసీ సింగతి శ్యామల, ఆత్మ చైర్మన్ సున్నం రాజు, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ అశోక్‌గౌడ్, పీఏఏసీఎస్ చైర్మన్ మేకల మల్లేశ్, సర్పంచ్‌లు బత్తిని పద్మ, ఏస్కూరి లక్ష్మి, తిరుపతి రెడ్డి, మల్లయ్య, బాపు, శంకర్, ఎంపీటీసీ పురంశెట్టి తిరుపతి, కమల, కో ఆప్షన్ సభ్యులు ఇబ్రహీం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాగర్‌గౌడ్, నాయకులు భీమాగౌడ్, ప్రతాప్‌రెడ్డి, రాంచందర్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ ఇందూరి రమేశ్, ప్రేమ్‌సాగర్, చీర్ల మొండన్న, కామేర శ్రీనివాస్, కొయ్యడ శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు