ఇచ్చోడ, జూన్ 11 : పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం హరితహారం అమలు చేస్తున్నదని జిల్లా అదనపు జడ్పీ సీఈవో రాథోడ్ రాజేశ్వర్ పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని బోరిగామ, కామగిరి గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్యం బారీ నుంచి కాపాడుకోవాలంటే విరివిగా మొక్కలు నాటి సంరక్షించుకోవాలని సూచించారు. మండల వ్యాప్తంగా ఈ ఏడాది మూడు లక్షల 40 వేల మొక్కలు నాటడానికి లక్ష్యంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కుంట అరుంధతి సురేందర్ రెడ్డి, తొడసం భీంరావ్, ఎంపీడీవో ్ల రాంప్రసాద్, ఎంపీవో కొమ్ము రమేశ్, ఏపీవో నరేందర్ గౌడ్ పాల్గొన్నారు.
బోథ్, జూన్ 11: తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని మండల పంచాయతీ అధికారి జీవన్‌రెడ్డి సూచించారు. పల్లె ప్రగతిలో భాగంగా గొల్లాపూర్, పార్డీ(కే), పార్డీ(బీ), దేవులనాయక్తండా గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీవో మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు చెత్త సేకరణకు వస్తే తడి, పొడి చెత్తను అందించాలన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌గౌడ్, వార్డు సభ్యులు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జూన్ 11 : గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలో చేపడుతున్న పల్లె ప్రగతి పనులను ఎంపీవో సంతోష్ పరిశీలించారు. వంగిన విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ అధికారుల సరి చేశారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేసి సీసీ రోడ్లను శుభ్రం చేశారు. మురుగు కాలువల్లో చెత్తతో పాటు పూడికతీత తొలగించారు. కార్యక్రమంలో ఇంద్రవెల్లి ఈవో సంజీవరావ్, విద్యుత్ శాఖ అధికారులు దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్, జూన్ 11: పల్లె ప్రగతితో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఎంపీపీ కనక మోతుబాయి అన్నారు. మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో చేపడుతున్న పల్లె ప్రగతి పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో గ్రామాల్లో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ ఏఈ ఖదీర్, సర్పంచ్ కనక సేవంతబాయిప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి నిరంజన్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
నార్నూర్, జూన్ 11 : గాదిగూడ మండలం అర్జుని, పర్సువాడ(కే), దాబా(కే)తో పాటు పలు గ్రామాల్లో చేపడుతున్న పల్లె ప్రగతి పనులను ఎంపీవో షేక్ ఖలీమ్ హైమద్ పరిశీలించారు. పారిశుధ్య పనులు, నర్సరీల్లో మొక్కల పెంపకం, అవెన్యూ ప్లాంటేషన్‌లో మొక్కల సంరక్షణ, డంప్‌యార్డుల నిర్వహణ వంటి పలు రకాల పనులు పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
ఉట్నూర్ రూరల్, జూన్ 11 : పవర్ డేతో మస్యలు దూరమవుతాయని ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్ పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా శనివారం మండల కేంద్రంలో పవర్ డే నిర్వహించారు. విద్యుత్ వైర్లను సరి చేయడం, కరెంట్ స్తంభాలు వేయడం, వైర్లకు తాకుతున్న చెట్టు కొమ్మలను తొలగించారు. కార్యక్రమంలో ఎంపీడీవో తిరుమల, విద్యుత్ ఏడీ చంద్రశేఖర్, ఏఈ రాజేశం, సిబ్బంది పాల్గొన్నారు.
జైనథ్, జూన్ 11 : ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీడీవో గజానన్‌రావు అన్నారు. మండలంలోని మామిడిగూలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
బేల, జూన్ 11 : మండల కేంద్రంతో పాటు మండలంలోని డోప్టాల , శంషాబాద్, సదల్పూర్ గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు కొనసాగుతున్నయి. పారిశుధ్య కార్మికులు గ్రామాల్లో నెలకొన్న చెత్తాచెదారం తొలగించారు. డోప్టాల గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు చిన్నారులు , గర్భిణులకు వైద్య పరీక్షలు చేశారు. శుక్రవారం సదల్పూర్ గ్రామంలో మండల అధికారులు పల్లె నిద్ర చేపట్టారు. గ్రామస్తులతో సమవేశం నిర్వహించి గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే పంచాయితీ కార్యాలయంలో నిద్రపోయారు. కార్యక్రమంలో ఎంపీడీవో భగత్ రవీందర్, ఎంపీవో సుమీర్ హైమద్, సర్పంచ్‌లు వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, రాకేశ్, శారద, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.