ఆసిఫాబాద్ టౌన్, జూన్ 4 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మ న ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఇందులో భాగంగా డిజిటల్ తరగతులు నిర్వహించనున్నదని కుమ్రంభీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. మండలంలోని అంకుశాపూర్, తేలిగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఆసిఫాబాద్ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావుతో కలిసి శనివారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, ప్రహరీ వంటి వాటికి నిధులు వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని బలోపేతం చేసేలా డిజిటల్ తరగతులు, టీవీల ద్వారా బోధన సాగనుందని చెప్పారు. అ నంతరం పాఠశాల ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అడిషనల్ కలెక్టర్ రాజేశం, ఎంపీపీ మల్లికార్జున్, ఎంపీడీవో శశికళ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంధం శ్రీనివాస్, నాయకులు గోపా ల్ నాయక్, భీమన్న, రమేశ్, రాంచందర్, కేశవ్, సర్పంచ్, ఎంపీటీసీ, పాఠశాల చైర్మన్, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నదని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని తారకరామనగర్‌లో పర్యటించారు. పలువురు కాలనీ వాసులు తాగునీటి సమస్య తీర్చాలని కోరారు. వెంటనే సంబంధిత అధికారులకు కాలనీలో ఉన్న బోరుబావులకు విద్యుత్ మోటర్ బిగించాలని ఆదేశించారు. దీంతో విద్యుత్ మోటర్లు బిగించి కాలనీలో తాగునీటిని అందించారు. మండలంలోని కౌటగూడ గ్రామంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అదనపు కలెక్టర్ రాజేశం, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావుతో కలిసి పర్యటించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డీపీవో రమేశ్, పంచాయతీ కార్యదర్శి వంశీకృష్ణ పాల్గొన్నారు.