బోథ్, జూన్ 4 : ప్లాస్టిక్ వాడకాన్ని (సింగిల్ యూజ్) నిషేధించాలని మండల ప్రత్యేకాధికారి శ్రీధర్‌స్వామి, ఎంపీడీవో దుర్గం రాజేశ్వర్, మండల పంచాయతీ అధికారి జీవన్‌రెడ్డి సూచించారు. పల్లె ప్రగతిలో భాగంగా శనివారం మండలంలోని కన్గుట్ట, కుచులాపూర్, ధన్నూర్(బీ) గ్రామాల్లో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకం మూలంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందన్నారు. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకొని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు మారుపాక శ్యామల, కే చంద్రమోహన్, గంగాధర్, ఎంపీటీసీ నారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రత్యేకాధికారులు, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నేరడిగొండ, జూన్ 4 : మండలంలోని లఖంపూర్, రోల్మామడ గ్రామాల్లో చేపడుతున్న పల్లెప్రగతి పనులను ఎంపీవో శోభన పరిశీలించారు. ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, మురుగు నీరు నిలువ లేకుండా చూసుకోవాలని సూచించారు. సింగిల్‌యూజ్ ప్లాస్టిక్, మరుగుదొడ్లపై అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు అనసూయబాయి, కుమ్రం జంగు, గ్రామ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
సిరికొండ, జూన్ 4 : పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సిరికొండ ప్రత్యేకాధికారి సర్ఫరాజ్ అన్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించారు. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. మురుగు కాలువల్లో చెత్తాచెదారం వేస్తే హోటల్ యజమానులు, వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సురేశ్, ప్రత్యేకాధికారి ప్రవీణ్, సోంపల్లి సర్పంచ్ శకుంతల, పంచాయతీ కార్యదర్శి సునీల్ కుమార్ పాల్గొన్నారు.
ఇచ్చోడ, జూన్ 4 : ముక్రా(కే) గ్రామంలో పరిసరాలను, ఇంకుడు గుంతలు, మురుగు కాలువలను సర్పంచ్ గాడ్గె మీనాక్షి పరిశీలించారు. కిరాణా దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధిస్తున్నామని, ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని తెలిపారు. అనంతరం కిరాణా దుకాణాల యజమానులకు పంచాయతీ ద్వారా జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గె సుభాష్, ఉపసర్పంచ్ వర్షతాయి, పంచాయతీ కార్యదర్శి కిరణ్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తాంసి, జూన్ 4 : పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని కప్పర్ల, తాంసి, పొన్నారి, హస్నాపూర్, సవర్గం, జామిడి, వడ్డాడి, ఘోట్కూరి, గిరిగాం గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు స్వచ్ఛ ఓడీఎఫ్ కార్యక్రమాలు నిర్వహించారు. కప్పర్లలో నిర్వహించిన కార్యక్రమానికి తహసీల్దార్ శ్రీదేవి హాజరయ్యారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ చెత్తబుట్టలు అందజేశారు. సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగించకుండా చూడాలని అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో ఆకుల భూమయ్య, డీటీ విష్ణు, ఏవో రవీందర్, ఎంపీవో సుధీర్‌రెడ్డి, సర్పంచ్‌లు సదానందం, కృష్ణ, కేశవ్‌రెడ్డి, నర్సింగ్, శ్రీనివాస్, భరత్, గజానన్, సంజీవ్‌రెడ్డి, ఎంపీటీసీలు అశోక్, రేఖ, భాగ్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నార్నూర్, జూన్ 4 : గ్రామాల్లో ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని మండల పంచాయతీ అధికారి స్వప్నశీల అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని తాడిహత్నూర్ గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను ఎంపీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తడి, పొడి చెత్తాచెదారాన్ని ట్రాక్టర్ ద్వారా డంప్‌యార్డుకు తరలించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. వృథానీరు ప్రవహించే ప్రదేశాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. ఆమె వెంట ఉప సర్పంచ్ ఫఢ్ విష్ణు, పంచాయతీ కార్యదర్శి శేఖర్ ఉన్నారు.
ఇంద్రవెల్లి, జూన్ 4 : మండలంలోని వాల్గొండ, హీరాపూర్, కేస్లాపూర్, ముత్నూర్ గ్రామాల్లో శనివారం అధికారులు పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు అవరసమున్న అభివృద్ధి పనులపై ప్రణాళిక చేశారు. సీసీ రోడ్ల నిర్మాణాలకు కొలతలు తీసుకొని మంజూరు కోసం ప్రతి పాదనాలు తయారు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కినక జుగాదిరావ్, నాగోరావ్, మెస్రం రేణుకానాగ్‌నాథ్, బాగుబాయి, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
బేల, జూన్ 4 : గ్రామాల్లో నెలకొన్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తహసీల్దార్ బడాల రాంరెడ్డి అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని పలు వాడల్లో తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు కాలనీల్లో ఉన్న చెత్తాచెదారం తొలగించి శుభ్రం చేయించారు. అలాగే చంద్పల్లి, దహిగాం, మణియార్‌పూర్, బెదోడ ర్యాలీలు తీసి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బేల సర్పంచ్ వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రత్యేకాధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.