దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్న జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్ర ం సక్కు అన్నారు. భూసిమెట్టకు చెందిన లబ్ధిదారులు జాడి రవీందర్, జాడి రమేశ్ మంజూరైన నిధులతో బొలేరో వాహనం పంపిణీ చేసి, టెంట్‌హౌస్‌ను శుక్రవారం జైపూర్ మండల కేంద్రంలో ప్రారంభించారు. దళిత బంధు పథకం కింద రూ.10 లక్షలు మంజూరు చేసి దళితులకు ఆర్థిక చేయూతను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని కొనియాడారు. వేర్వేరుగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్‌రావు, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాల, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్‌రావు, ఎంపీపీ కుమ్ర తిరుమల, సహకార సంఘం చైర్మన్ కొడప హన్నుపటేల్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఫెరోజ్‌ఖాన్, తహసీల్దార్ సాయన్న, అబ్దుల్ రహీం, ఎంపీడీవోలు ప్రభుదయ, మధుసూదన్, సర్పంచ్‌లు పార్వతి లక్ష్మణ్, మడావి భీంరావు, గోవింద్రావు, మాధవ్‌రావు, మెస్రం అంబాజీరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులున్నారు.