కౌటాల/మంచిర్యాలటౌన్, జూన్ 3 : కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో శుక్రవారం ఎండ దంచికొట్టింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 45.4 (కౌటాల మం డలం ఎల్కపల్లి) డిగ్రీలు, మంచిర్యాల జిల్లాలో 45.3 డిగ్రీలు, ఆదిలాబాద్లో 43.3, నిర్మల్లో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉద యం 7 గంటల నుంచే భానుడి భగభగలు ప్రారంభమయ్యాయి. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఇండ్లనుంచి బయటకు రాలే దు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనబడింది. పగలు, రాత్రీ తేడా లేకుండా వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. శీతలపానీయాలను ఆశ్రయించడంతో పాటు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు.