బడీడు పిల్లలను సర్కారు పాఠశాలల్లోనే చేర్పించాలని ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జయశంకర్ బడిబాట కార్యక్రమం శుక్రవారం ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల్లో నిర్వహించారు. మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా సకల సౌకర్యాలు కల్పించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇంగ్లిష్ మీడియం తరగతులు నిర్వహిస్తున్నామని అవగాహన కల్పించారు.
సోన్, జూన్ 3 : పిల్లలను సర్కారు బడులకే పంపించాలని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. నిర్మల్, సోన్ మండ లాల్లోని ఆయా గ్రామాల్లో శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి బడీడు పిల్లలను బడిలో చేర్పించా లని కోరారు. సోన్తోపాటు గంజాల్, కడ్తాల్, సాకెర, న్యూవెల్మల్, బొప్పారం, పాక్పట్ల, సంగంపేట్, నిర్మల్ మండలం అక్కాపూర్, డ్యాం గాపూర్, వెంగ్వాపేట్, చిట్యాల్, లంగ్డాపూర్, తల్వే ద, తదితర గ్రామాల్లో ఉపాధ్యాయు లు చదువు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు.
బాసర, జూన్ 3 : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాడిబాట కార్యక్ర మాన్ని వైస్ ఎంపీపీ ఓని నర్సింగ్‌రావు ప్రారం భించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనతో పాటు, ఉచిత పుస్తకాల పంపిణీ, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, మధ్యాహ్న భోజన వసతి ఉంటుం దని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ విద్యాసంవత్స రం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడి యం ప్రవేశపెట్టిందని తెలిపారు. హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఖానాపూర్ టౌన్, జూన్ 3 : సాయినగర్ కాలనీలో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించా రు. వార్డు ప్రజలు, పిల్లల తల్లిదండ్రులకు పాఠశా లల బలోపేతంపై అవగాహన కల్పించారు. పిల్లల ను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆరోవార్డు కౌన్సిలర్ అఫ్రీనా బేగం కోరారు. అంగన్ వాడీ టీచర్లు అనుపమ, వరలక్ష్మి, నాయకులు అమా నుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.
కుంటాల, జూన్ 3 : బడిబాటలో భాగంగా పెంచికల్‌పాడ్ గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ‘ప్రైవేటు వద్దు-ప్రభుత్వ పాఠశాల ముద్దు’అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్ భోజాబాయి, హెచ్ఎం మాదిరి ఎల్లన్న పాఠశాల కమిటీ సభ్యులు గ్రామస్తులు, ఉపాధ్యా యులు తదితరులు పాల్గొన్నారు.