తలమడుగు, జూన్ 3 : పల్లె ప్రగతి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో గణపతి అన్నారు. మండలంలోని ఖోడద్లో పల్లె ప్రగతి పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. గ్రామ సభలో పాల్గొన్నారు. కుచులాపూర్, పల్సి(కే), పల్సీ (బీ)పంచాయతీల్లో గ్రామ సభల్లో పాల్గొన్నారు. గ్రామాల్లోని నర్సరీలు, మురుగు కాల్వలను పరిశీలించారు. కుచులపూర్‌లో క్రీడా ప్రాంగణం పనులను పర్యవేక్షించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కల్యాణం లక్ష్మి, జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి, ఎంపీడీవో రమాకాంత్, ఎంపీవో దిలీప్, సర్పంచ్‌లు ఆనంద్, కరుణాకర్ రెడ్డి, పోతారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, జూన్ 3 : ఇచ్చోడ, ముక్రా (కే), ముక్రా (బీ), సిరిచెల్మ, బోరిగామ, గేర్జం, మల్యా ల తదితర గ్రామాల్లో ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించారు. సర్పంచ్ల ఆధ్వర్యంలో గ్రామసభలు ఏర్పాటు చేశారు. నాలుగు విడుతల్లో సాధించిన ఫలితాలను వెల్లడించారు. చేపట్టాల్సిన ప్రణాళికలు తయారు చేశారు. ముక్రా (కే) జీపీ ఏర్పాటైనప్పటి నుంచి గ్రామంలో రూ. 33 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని సర్పంచ్ గాడ్గె మీనాక్షి వెల్లడించారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పాలక వర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తాంసి, జూన్ 3 : పల్లెప్రగతి కార్యక్రమం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. ముందుగా గ్రామ సభలు నిర్వహించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు గ్రామాల్లో ర్యాలీలు తీశారు. ఈ సందర్భంగా పల్లెప్రగతి విశిష్టత, ప్రజలను భాగస్వాములను చేస్తూ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి రోజు పల్లెల్లో మురుగు కాలువలు శుభ్రం చేయాలని తీర్మానాలు చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు. తాంసిలో జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, మండల ప్రత్యేక అధికారి సుదర్శన్, ఎంపీడీవో ఆకుల భూమయ్య, సర్పంచ్ కృష్ణ, ఎంపీటీసీ అరుణ్‌కుమార్, బండలనాగాపూర్లో ఎంపీపీ సురుకుంటి మంజుల-శ్రీధర్‌రెడ్డి, ఏపీఎం రవీందర్, సర్పంచ్ గంగుల వెంకన్న, కప్పర్లలో తహసీల్దార్ శ్రీదేవి, సర్పంచ్ సదానందం, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, జామిడిలో సర్పంచ్ సరితా కేశవ్‌రెడ్డి, ఎంపీవో దయాకర్, కార్యదర్శి అనిత, ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
నేరడిగొండ, జూన్ 3 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం చేపడుతున్నదని జడ్పీటీసీ జాదవ్ అనిల్ అన్నారు. ఐదో విడు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని లఖంపూర్ (జీ) గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పవన్‌చంద్ర, ఎంపీపీ రాథోడ్ సజన్, వైస్ ఎంపీపీ మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు కుమ్రం జంగు, పెంట వెంకటరమణ, ఉప సర్పంచ్ దేవేందర్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ర్యాలీలు తీశారు. ముందుగా గ్రామసభలు నిర్వహించారు. చేపట్టాల్సిన పనుల ప్రణాళికలు రూపొందించి, తీర్మానాలు చేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు, ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
బోథ్, జూన్ 3: బోథ్ పట్టణంలో పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని సర్పంచ్ జీ సురేందర్ యాదవ్ కోరారు. బోథ్ పంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. పిప్పల్ధరిలో ఎంపీడీవో దుర్గం రాజేశ్వర్ మాట్లాడారు. గ్రామానికి ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ఏఈఈ జనార్దన్ రెడ్డి, ఈవో అంజ య్య, జీపీ కార్యదర్శి రజిత, వార్డు సభ్యులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కౌఠ (బీ), పట్నాపూర్‌లో సర్పంచ్‌లు రాధిక, సుగుణ, కార్యదర్శులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్, జూన్3: ఆదిలాబాద్ రూరల్ మండలం చిట్యాలబోరిలో ఎంపీపీ సెవ్వ లక్ష్మీజగదీశ్, ఏవో అశ్రఫ్ ,పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్వర్, మాలెబోరెగాంలో ఎంపీడీవో శంకర్, ప్రత్యేకాధికారి పద్మభూషణ్ రాజ్, వాన్వట్లో సర్పంచ్ తూర్పాబాయి , ఉపసర్పంచ్ కేమ నందు , కార్యదర్శి మహేశ్ ,ప్రత్యేకాధికారి మోహన్ గ్రామసభలు నిర్వహించారు. ర్యాలీలు తీశారు. పచ్చదనం,పరిశుభ్రత ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.
సిరికొండ, జూన్ 3: మండలంలోని అన్ని పంచాయతీల్లో ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినితులు ప్రారంభించారు. మండల కేంద్రంలో తహసీల్దార్ సర్ఫరాజ్ నవాబ్ ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి విజయ్ కుమార్, ఎంపీడీవో సురేశ్, సర్పంచ్ నర్మద, ఎంపీటీసీ సూర్యకాంత, మాజీ సర్పంచ్ పెంటన్న,ఆయా శాఖాల ఆధికారు పాల్గొన్నారు.
భీంపూర్, జూన్ 3: మండలంలోని 26 పంచాయతీల్లో పల్లెప్రగతి కార్యక్రమం ప్రారంభించారు. సర్పంచులు,జీపీ సభ్యులు,కార్యదర్శులు ర్యాలీలు నిర్వహించారు. పరిశుభ్రత, పచ్చదనంపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగించవద్దని దుకాణాలకు పత్రాలు అందజేశారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ సుధాకర్ కుమ్ర, ఎంపీపీ రత్నప్రభ, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్‌లు మడావి లింబాజీ , పెండెపు కృష్ణయాదవ్, భూమన్న , వేణు , కార్యదర్శులు సాయినందన, నితిన్, గ్రామస్తులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, జూన్ 3 : పల్లె ప్రగతితో గ్రామాలు సమగ్ర ఆభివృద్ధి సాధిస్తాయని మండల ప్రత్యేకధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఐదో విడుత పల్లెప్రగతి పనులను శుక్రవారం పర్యవేక్షించారు. బజార్హత్నూర్, పిప్పిరి, జాతర్ల, గిర్నూర్, కొల్హారి తదితర గ్రామాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. మండలకేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హరితహారంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని కోరారు. ఉపసర్పంచ్ చట్ల విలాస్, ఎంపీడీవో మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు పరాచ సాయన్న, బలిరాం, కార్యదర్శి పాల్గొన్నారు.
జైనథ్, జూన్ 3 : మండలంలోని అన్ని గ్రామాల్లో ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. అన్ని గ్రామాల్లో సభలు నిర్వహించారు. పార్డీ(బీ)లో ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల బరువు తూకం వేశారు. కొలతలు గణించారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేశారు. వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, ఎంపీడీవో గజానన్‌రావు, ప్రత్యేక అధికారి పుల్లయ్య, ఎంపీవో వెంకట్రాజు, ఐటీడీఏ డైరెక్టర్ పెందూర్ దేవన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జూన్ 3 : కెస్లాపూర్ పరిధి కెస్లాగూడ(ఎం)లో సర్పంచ్ మెస్రం రేణుక, అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించారు. కార్యక్రమంలో జీపీ కార్యదర్శి మహ్మద్ మోతేశ్యాం, మాజీ సర్పంచ్ మెస్రం నాగ్నాథ్, ఉప సర్పంచ్ మీర్జా సిరాజ్బేగ్, ఐకేపీ సీసీ మోతీరాం, అంగన్వాడీ కార్యకర్త కమలాబాయి, గ్రామస్తులు మహాదేవ్ పటేల్, ఉశన్న, మీర్జా నాజుబేగ్, నాయకులు పెందూర్ గణేశ్, తొడసం సాగర్ పాల్గొన్నారు. ఇంద్రవెల్లి సర్పంచ్ కోరెంగా గాంధారి ఆధ్వర్యం లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వ హించారు. కార్యక్రమంలో ఎంపీవో సంతోష్, జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, కోవ రాజేశ్వర్, గీత్తే ఆశాబాయి, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు షేక్ సూఫియాన్, ఈవో సంజీవరావ్, మాజీ సర్పంచ్ కోరెంగా సుంకట్రావ్, నాయకులు సోమోరే నాగోరావ్, కనక హనుమంత్‌రావ్, దత్తా, బాలాజీ పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, జూన్ 3: గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నదని ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు అన్నారు. మండలంలోని ఘన్‌పూర్‌లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎంపీపీ పాల్గొన్నారు. దంతన్‌పెల్లి, కొత్తగూడ(జీ), లక్కారం, మత్తడిగూడ, హస్నాపూర్, పులిమడుగు, నాగాపూర్, కన్నాపూర్ తదితర పంచాయతీల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించారు. శ్యాంపూర్‌లో తహసీల్దార్ భోజన్న గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్‌లు రాథోడ్ జనార్దన్, గుండాల మల్లిక, ఆత్రం రాహుల్, మడావి యశోదబాయి, ప్రత్యేక అధికారులు ఆయా గ్రామాల్లో ర్యాలీలు తీశారు.
నార్నూర్,జూన్ 3: ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మండలంలోని పంచాయతీల్లో సర్పంచ్‌లు, ప్రత్యేకాధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ర్యాలీలు తీశారు. పంచాయతీ కార్యాలయాల్లో గ్రామసభలు ఏర్పాటు చేశారు. ఆయా పంచాయతీల ఆదాయ, వ్యయాలు, నాలుగో విడుతలో చేపట్టిన అభివృద్ధి, నిధుల వినియోగం వివరాలను కార్యదర్శులు వెల్లడించారు. ఐదో విడుతలో చేపట్టాల్సిన పనుల ప్రణాళికను రూపొందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు,ప్రత్యేకాధికారులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పాల్గొన్నారు.
ఉట్నూర్, జూన్ 3: పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అందులో భాగంగా పల్లెప్రగతి నిర్వహిస్తున్నదన్నారు. కార్యక్రమంలో జీపీ ప్రత్యేక అధికారి తిరుమల, మాజీ సర్పంచ్ బొంత ఆశారెడ్డి, ఈవో శంకర్, జీపీ కార్మికులు సల్మాన్, మనోహర్ , గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎదులాపురం,జూన్3 : పట్టణప్రగతిలో వార్డులోని సమస్యలను పరిష్కరించుకొని అవసరం ఉన్న పనులు చేయించుకుందామని కౌన్సిలర్ రామెల్లి శ్రీలత అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా శ్రీరామ్‌కాలనీ వాసులకు అర్బన్ తహసీల్దార్ పీ సతీశ్‌తో కలిసి అవగాహన కల్పించారు. 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వా ములు కావాలన్నారు. ఖాళీస్థలాల వివరాలు, యజమానికి వివరాలు తెలియజేయాలని, ఆ స్థలంలోని చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించేలా నోటీసులు ఇవ్వాలన్నారు.