మామడ, జూన్ 3 : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని గాయిద్పెల్లి గ్రామంలో శుక్రవారం ఐదో విడుత పల్లెప్రగతి ప్రారంభోత్సవం లో పాల్గొన్నారు. గ్రామాలను ఆర్థికంగా, పారిశుధ్యం, పచ్చదనం పెంపొందించేలా ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తున్నదన్నారు.
కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూ ఖీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే. జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, ఎంపీపీ అమృత, జడ్పీటీసీ సో నియా, డీసీసీ బీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, వైస్ ఎం పీపీ లింగారెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, సర్పంచ్ రాందాస్, ఎంపీటీసీ చరణ్యజాలం, ఎంపీడీవో మల్లే శం, తహసీల్దార్ కిరణ్మయి, టీఆర్ఎస్ మండల కన్వీన ర్ చంద్రశేఖర్‌గౌడ్, నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.
దిలావర్పూర్, జూన్ 3: పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియాలని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టా ల్లో అభివృద్ధి శూన్యమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని న్యూ లోలం గ్రామంలో ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏర్పా టు చేసిన క్రీడా మైదానాన్ని ఆయన ప్రారంభించారు. క్రీడా ప్రాంగణంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. క్రీడాకారులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడారు. అనంత రం గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. తెలంగా ణ వచ్చిన తర్వాత చేసిన పనుల గురించి గ్రామస్తులకు వివరించారు.
సర్పంచ్ ఓడ్నం సవిత, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఆర్డీవో విజయలక్ష్మి, తహసీల్దార్ కరీం, ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజీజ్‌ఖాన్, ఏవో స్రవంతి, ఎంపీపీ పాల్దే అక్షర, సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాష్‌రావు, వైస్ ఎంపీపీ బాబురావు, సర్పంచులు గంగారెడ్డి, శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు పాల్దే అనిల్, ఒడ్నం కృష్ణ, గుణవంత్‌రావు, స్వామిగౌడ్, గోవిందుల మహేశ్, రామాగౌడ్, తమ్మల్ల ముత్యం, నాయకులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, జూన్ 3 : నిర్మల్ పట్టణంలోని వార్డు నంబర్ 14,15, 32 వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. కాలనీల్లో తిరుగతూ పరిసరాలను పరిశీలించారు. కాలనీలు, పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం వార్డుల్లో పర్యటించి జేసీబీ సహాయంతో అభివృద్ధి పనులు చేయించారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
సోన్, జూన్ 3 : రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వయస్సు 74 ఏండ్లు.. పొద్దున లేచినప్పటి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వరుసగా ప్రభుత్వ కా ర్యక్రమాలు.. అయినా మంత్రి అలసిపోలేదు.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ైస్లెకింగ్ ర్యాలీలో 12 కి.మీ సైకిల్ తొక్కి ఔరా అనిపించారు మంత్రి.. మామడ మండలంలోని గాయిద్పెల్లిలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పా ల్గొని నిర్మల్ మండలంలోని చిట్యాల్ గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. క్రీడలు ఆడిన తీరు అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. మొదట క్రీడాకారులతో పరిచయం చేసుకున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఓ జట్టుకు, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే మరో జట్టుకు నాయకత్వం వహించారు.
పది నిమిషాల పాటు ఏడుగురు ప్రజాప్రతినిధులు, క్రీడాకారులతో కబడ్డీ ఆడారు. ఎదుటి కోర్టులో ధైర్యంగా ‘కబడ్డీ.. కబడ్డీ’ అంటూ కూతకు వెళ్లారు. ప్రత్యర్థి జట్టులోని సభ్యులను ఔట్ చేసి క్రీడల్లో తన సత్తా చాటారు. అనంతరం వాలీబాల్ ఆటను ప్రారంభించిన మంత్రి.. సర్వీసుతో పాటు ఎదుటి కోర్టులో ఉన్న క్రీడాకారులు విసిరిన సర్వీసునూ సునాయసంగా లిప్టు చేశారు. ఇంత వయస్సులో సాధారణ వాలీబాల్, కబడ్డీ క్రీడాకారుడికే సాధ్యం కాని ఆటల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆడిన తీరుపై ప్రజలు, అధికారులు చప్పట్లతో అభినందించారు.
అంతకుముందు చిట్యాల్ గ్రామంలో జాతీ య గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద రూ.4.50 లక్షలతో నిర్మించిన మోడల్ గ్రామీణ క్రీడా మైదానాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రితో కలిసి అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు, జడ్పీ కో ఆప్షన్ సభ్యు డు సుభాష్‌రావు, సర్పంచ్ పడకంటి రమేశ్‌రెడ్డి, తహసీల్దార్ ప్రభాకర్, ఉప సర్పంచ్ చిన్నయ్య, ఏపీవో తుల రామకృష్ణ తదితరులు క్రీడలు ఆడారు.
నిర్మల్ మండలంలోని చిట్యాల్ గ్రామం ఐదో విడు త పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి అల్లోల ఇంద్రకర ణ్‌రెడ్డి ప్రారంభించారు. గ్రామంలోని రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గ్రామంలో చేపట్టిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న సర్పంచ్ రమేశ్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, నిర్మల్ ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్రె డ్డి, సర్పంచ్ పడకంటి రమేశ్‌రెడ్డి, ఎఫ్ఏసీఎస్ మాజీ చై ర్మన్ రాంకిషన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, పల్లె ప్రగతి ప్రత్యేక పరిశీలకుడు నర్సింహులు, డీఆర్డీవో విజయలక్ష్మి, విద్యుత్‌శాఖ జిల్లా అధికారి జయంత్‌రావు చౌహాన్, ఏపీడీ ఓస ప్రసాద్, డీపీవో శ్రీలత, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ ప్రభాకర్, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్రావు, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, ఉప సర్పంచ్ చిన్నయ్య, ఎంపీటీసీ రాజవ్వ, ఏపీవో తుల రామకృష్ణ, ఏవో వసంత్‌రావు, ఏఈవో హర్షిత పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, జూన్ 3 : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, కాలుష్య నివారణకు వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు కృషి చేయాల ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ సైక్లింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో ఎన్సీసీ, నిర్మల్ సైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చే సిన సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ.. మం చిర్యాల చౌరస్తా, చించోలి క్రాస్ రోడ్డు, హరిత వనం, ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు కొనసాగింది. మొత్తం 15.5 కిలో మీటర్ల ర్యాలీలో మంత్రి ఉత్సాహంగా సైకి ల్ తొక్కారు. ప్రపంచ సైక్లింగ్ దినోత్సం సందర్భంగా సైకిల్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. నిర్వాహకులు రామకృష్ణ, సైక్లింగ్ సభ్యులు పాల్గొన్నారు.