బడీడు పిల్లలను సర్కారు పాఠశాలల్లోనే చేర్పించాలని ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జయశంకర్ బడిబాట కార్యక్రమం శుక్రవారం ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల్లో నిర్వహించారు. మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా సకల సౌకర్యాలు కల్పించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇంగ్లిష్ మీడియం తరగతులు నిర్వహిస్తున్నామని అవగాహన కల్పించారు.
ఆదిలాబాద్ టౌన్, జూన్ 3: పిల్లలను సర్కారు బళ్లల్లో చేర్పించాలని డీఈవో ప్రణీత కోరారు. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్‌గూడలో నిర్వహించిన బడిబాటలో డీఈవో పాల్గొన్నారు. పిల్లలను సర్కారు బడుల్లో చేర్చాలని కోరారు. కార్యక్రమంలో ఏంఈవో జయశీల, సెక్టోరల్ అధికారులు నర్సయ్య, సుజాతఖాన్, హెచ్ఎం గంగన్న, వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్ ఉన్నారు.
ఆదిలాబాద్ రూరల్, జూన్ 3: ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. మొదటి రోజు జిల్లా కేంద్రంలోని గెజిటెడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల-1లో హెచ్ఎం నీలాదేవి ఆధ్వర్యంలో కౌన్సిలర్ కలాల శ్రీనివాస్, వార్డు స్పెషల్ ఆఫీసర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పాఠశాల పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం కాలనీల్లో తిరుగుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. చాంద(టీ)లో హెచ్ఎం శశికళ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ భాష్కర్, ఎంపీటీసీ శ్రీనివాస్, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ రాధ, సభ్యులుశ్రీనివాస్, అశోక్, ధర్మన్న, గణేశ్ పాల్గొన్నారు.
తాంసి, జూన్ 3 : బడీడు పిల్లలను తప్పకుండా పాఠశాలల్లో చేర్పించాలని కప్పర్ల సర్పంచ్ కేమ సదానందం అన్నారు. మండలంలోని కప్పర్లలో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సంతోష్, ఉపసర్పంచ్ కుమార్, జడ్పీఎస్హెచ్ హెచ్ఎం కిష్టయ్య, పీఎస్ హెచ్ఎం రాజన్న, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, జూన్ 3 : బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇచ్చోడతో పాటు దాబా (బీ)లో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ర్యాలీలు తీశారు. కార్యక్రమంలో సర్పంచ్ సూర్యవంశీ రామారావ్, ఇచ్చోడ ఎంపీటీసీ నిమ్మల శివ కుమార్,హెచ్ఎంలు ప్రఫుల్ చందర్ రెడ్డి, కవిత, అశ్విని, ఎస్ఎంఎస్ చైర్మన్ దత్తు, అంగన్వాడీ టీచర్ సుమిత్ర, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జూన్ 3 : బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎం గోపాల్‌సింగ్ తిలావ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గుడిహత్నూర్,జూన్3: మండలంలో బడిబాట, పల్లెప్రగతి కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు, శాంతాపూర్ సర్పంచ్ జీ తిరుమల్‌గౌడ్ మాట్లాడారు. ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో తెలుగు మీడియం తోపాటు ఇంగ్లిష్ మీడియం విద్యావిధానం తీసుకొచ్చిందని ఈ అవకాశాన్ని మారుమూల ప్రజలు వినియోగించుకొని తమ పిల్లలకు ఖర్చులేకుండా విద్యను పొందాలన్నారు. పంచాయతీల్లో 15 రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలు గ్రామ సభలో వివరించారు. గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు,పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లులు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
భీంపూర్, జూన్3: మండలంలోని నిపాని గ్రామానికి చెందిన 20 మంది విద్యార్థులు 9వ తరగతి చదివేందుకు ప్రైవేట్ చేరేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న అక్కడి హెచ్ఎం, ఉపాధ్యాయులు, సర్పంచ్ భూమన్న వారిని 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాంసి మండలం కప్పర్ల ఉన్నత పాఠశాలలో చేర్పించారు. శుక్రవారం బడిబాట సందర్భంగా కప్పర్ల సర్పంచ్ సదానందం, అక్కడి ఉపాధ్యాయులు నిపానికి వచ్చి అభినందనలు తెలిపారు.
పిల్లలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. భీంపూర్, కరంజి(టీ), అంతర్గాం, అందర్‌బంద్ తదితర జీపీల్లో బడిబాట నిర్వహించారు. సర్పంచ్‌లు జీ స్వాతిక, భూమన్న, బక్కి లలిత, పెండెపు కృష్ణయాదవ్, మడావి లింబాజీ ,హెచ్ఎంలు సంతోష్, భూమన్న, శ్రీకాంత్, మహేశ్, శ్రీనివాస్, ఉప సర్పంచ్‌లు కేమ ప్రమీల, ఆకటి లక్ష్మీబాయి, కార్యదర్శులు నితిన్, సునీత, ఎస్ఎంసీ బాధ్యులు పంజాబ్,అనిల్ పాల్గొన్నారు.