ఆదిలాబాద్ రూరల్, జూన్ 2 : ప్రస్తుతం యువత సెల్ఫోన్లకు సమయం కేటాయిస్తూ తమ మానసిక, శారీరక ఆరోగ్యాలను దెబ్బ తీసుకుంటున్నారని, అందుకే ప్రభుత్వం క్రీడాస్థలాలను అభివృద్ధి చేసి యువత సన్మార్గంలో నడిచేలా చర్యలు తీసుకుంటున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని రిక్షాకాలనీ, డైట్ కళాశాలల్లో ఏర్పాటు చేయనున్న క్రీడాస్థలాలను గురువారం జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్‌తో కలిసి ప్రారంభించారు. యువత పెడదారి పట్టకుండా మైదానాలను అభివృద్ది చేస్తే వారు ప్రతిరోజూ వ్యాయామం, క్రీడల్లో పాల్గొనే అవకాశం దక్కుతుందన్నారు. పట్టణాల్లో, మండలాల్లో క్రీడా మైదానాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శైలజ, వార్డు కౌన్సిలర్ ఆవుల వెంకన్న పాల్గొన్నారు.
బేల, జూన్ 2 : మండలంలోని చప్రాల గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. గ్రామీణ యువత ఆటల్లో రాణించాలని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజారెడ్డి, నాయకులు గంభీర్ ఠాక్రె, ప్రమోద్ రెడ్డి, మెట్టు ప్రహ్లాద్, సతీశ్ పవార్, దౌలత్ పటేల్, మస్కే తేజ్రావ్, డీఆర్డీవో కిషన్, డీపీవో శ్రీనివాస్, ఎంపీడీవో భగత్ రవీందర్, తహసీల్దార్ బడాల రాంరెడ్డి పాల్గొన్నారు.
జైనథ్, జూన్ 2 : ప్రతి గ్రామంలో క్రీడా ప్రాం గణాలు నిర్మిస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని మాకోడలో క్రీడా ప్రాం గణాన్ని ప్రారంభించారు. మొదటి దశలో మాకో డ, జామిని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పా టు చేశామన్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, వైస్‌ఎంపీపీ విజయ్‌కుమార్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఎస్. లింగారెడ్డి, జిల్లా డైరెక్టర్ తల్లెల చంద్రయ్య, తహసీల్దార్ రాఘవేంద్రరావు, ఎంపీడీవో గజానన్రా వు, ఎంపీవో వెంకటరాజు, ఏపీవో మేఘమాల, ఎంపీటీసీ దేవన్న, ఇందిర, శార ద, సర్పంచులు ఊశన్న, సురేఖ, కాంతాబాయి పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, జూన్ 2 : మహారాష్ట్ర, తాంసి, భీంపూర్, బేల, జైనథ్ ప్రజల కోసమే ఠాకూర్ హోటల్ వద్ద బస్టాండ్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఠాకూర్ హోటల్ వద్ద మున్సిపల్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన బస్టాండ్‌ను ఆయన ప్రారంభించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దీనిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ము న్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కౌన్సిలర్లు సాయికుమార్, జాదవ్ పవన్ నాయక్, చందా నర్సింగ్, కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.