బోథ్, జూన్ 2: మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ అతిఖొద్దీన్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రవీందర్, పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐ నైలు, కోర్టులో జడ్జి హుస్సేన్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తుల శ్రీనివాస్, ఐసీడీఎస్‌లో సీడీపీవో సౌందర్య, గ్రామ పంచాయతీలో సర్పంచ్ సురేందర్‌యాదవ్, అటవీ శాఖ కార్యాలయంలో ఎఫ్ఆర్వో సత్యనారాయణ, బోథ్ సీహెచ్‌సీలో డాక్టర్ రవీంద్రప్రసాద్, సొనాల పీహెచ్సీలో డాక్టర్ నవీన్‌రెడ్డి, ఏఎంసీలో చైర్మన్ దావుల భోజన్న, ఆర్‌డబ్ల్యూఎస్‌లో డీఈఈ దేవయ్య, పశువైద్య కేంద్రంలో డాక్టర్ శ్రావణ్‌కుమార్, విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈఈ జనార్దన్‌రెడ్డి, ఐకేపీలో ఏపీఎం మాధవ్, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎస్ రుక్మాణ్‌సింగ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అన్ని గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు, యువజన సంఘాల్లో, కాంగ్రెస్, బీజేపీ పార్టీల కార్యాలయాల్లో కన్వీనర్లు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జై తెలంగాణ నినాదాలు చేశారు.
గుడిహత్నూర్, జూన్ 2 : మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ సంధ్యారాణి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎల్ ప్రవీణ్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ భరత్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జాదవ్ సునీత జాతీయ జెండాను ఎగురవేశారు. శాంతాపూర్, శంభుగూడ, మన్నూర్, గురుజ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు జీ తిరుమల్‌గౌడ్, కుమ్రం శంభు, మీనా, గోవింద్, టీఆర్ఎస్ కార్యాలయంలో మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వివిధ కార్యాలయాల్లో జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బ్రహ్మానంద్, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, నాయకులు పాల్గొన్నారు.
భీంపూర్ ,జూన్ 2 : భీంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రత్నప్రభ, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ మహేందర్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాధిక, పీహెచ్సీలో వైద్యాధికారి విజయసారథి, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, భీంపూర్, అర్లి(టీ) డీజీబీ, సహకార బ్యాంకుల్లో మేనేజర్లు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, వైస్‌ఎంపీపీ లస్మన్న ,రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అనిల్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్యయాదవ్, సర్పంచ్‌లు లింబాజీ, భూమన్న, కృష్ణయాదవ్, బాదర్, నాయకులు, పంచాయతీకార్యదర్శులు పాల్గొన్నారు.
తాంసి, జూన్ 2 : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సురుకుంటి మంజులా శ్రీధర్‌రెడ్డి, తహసీల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీదేవి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో రవీందర్, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం రవీందర్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ధనశ్రీ, పీఏసీఎస్‌లో వైస్ చైర్మన్ ధనుంజయ్, టీఆర్ఎస్ మండల శాఖ తరఫున కన్వీనర్ అరుణ్‌కుమార్, అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు జాతీయ జెండాను ఎగురేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాజు, ఆకుల భూమయ్య, ఎంపీవో సుధీర్‌రెడ్డి, సూపరింటెండెంట్ రవీందర్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, ఎంపీటీసీలు నరేశ్, రఘు, అశోక్, సర్పంచ్‌లు కృష్ణ, సదానందం, వెంకన్న, కేశవ్‌రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, జూన్ 2 : మండల కేంద్రంతో పాటు గ్రామ పంచాయతీల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ప్రీతమ్ రెడ్డి, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రాథోడ్ ఉదయ్‌రావ్, పోలీస్ స్టేషన్లో సీఐ రమేశ్ బాబు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు, అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్లు జాతీయ జెండాను ఎగురవేశారు.
ఇచ్చోడ బస్టాండు ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి టీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి జెండాను ఎగురవేశారు. ముక్రా(కే)లో సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ సుభాష్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, ఉపసర్పంచ్ లోక శీరిశ్ రెడ్డి, ఎంపీటీసీ నిమ్మల శివ కుమార్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ దాసరి భాస్కర్, రాథోడ్ ప్రవీణ్, వెంకటేశ్, ముస్తాఫా, భీముడు, గ్యాతం గంగయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ, జూన్ 2 : మండల కేంద్రంలోని ఎంపీడీవో, పోలీస్ స్టేషన్, తహసీల్, గ్రామ పంచాయతీ, టీఆర్ఎస్ కార్యాలయం, గ్రామాల్లోని కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. సిరికొండలో గాంధీ విగ్రహానికి సర్పంచ్ నర్మద, ఎంపీటీసీ పర్వీన్ పూలమాలలు వేశారు. కార్యక్రమంలో ఎస్ఐ నీరేశ్, తహసీల్దార్ సర్ఫరాజ్, ఎంపీడీవో సురేశ్, ఎంపీపీ అమృత్‌రావ్, జడ్పీటీసీ చంద్రకళ, సిరికొండ, సొంపల్లి, పొన్న, పొచ్చంపల్లి, రాయిగూడ, సుంకిడి సర్పంచ్‌లు నర్మద, చంద్రకళ, శకుంతల, జయశ్రీ, లక్ష్మి, అనిత, మాజీసర్పంచ్ పెంటన్న, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తలమడుగు, జూన్ 2 : మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కల్యాణం లక్ష్మి, గ్రామ పంచాయతీలో సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో మహేందర్, పశు వైద్యశాలలో డాక్టర్ రాథోడ్ దూదూరాం, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గోక జీవన్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కల్యాణం రాజేశ్వర్, అబ్దుల్లా పాల్గొన్నారు.
తాంసి, జూన్ 2 : ఆదిలాబాద్‌లోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏఆర్ఎస్ ఇన్చార్జి డా.వి. తిరుమల్‌రావు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా.డి.మోహన్‌దాస్, డా.రాజేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్, ఏఈవో మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
నేరడిగొండ, జూన్ 2 : నేరడిగొండ తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ పవన్‌చంద్ర, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రాథోడ్ సజన్, ఎమ్మార్సీలో ఎంఈవో భూమారెడ్డి, పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ కిశోర్‌సింగ్, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం సుదర్శన్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మహేందర్, అటవీ శాఖలో ఎఫ్ఆర్వో గణేశ్, కేజీబీవీలో స్పెషల్ ఆఫీసర్ జయశ్రీ, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఎంఏవో భాస్కర్, పీహెచ్సీలో డాక్టర్ లావణ్య, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జాదవ్ అనిల్, వైస్‌ఎంపీపీ మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో అబ్దుల్సమద్, నాయకులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, జూన్ 2: బజార్హత్నూర్ తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ గంగాధర్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ జయశ్రీ, మండల వ్యవసాయధికారి ప్రమోద్‌రెడ్డి, ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ వెంకన్న, ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి సురేశ్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సయ్యద్ ముజాహిద్, టీఆర్ఎస్ కార్యాలయం లో మండల కన్వీనర్ రాజారాం, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, జడ్పీటీసీ నర్సయ్య, ఎంపీటీసీ తిరుమల, వైస్‌ఎంపీపీ శ్రీనివాస్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.