రెబ్బెన, జూన్ 1 : బెల్లంపల్లి ఏరియాలోని గనులు మే నెల లో 98 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు బెల్లంపల్లి ఏరియా జీఎం జీ దేవేందర్ తెలిపారు. ఏరియాలోని గోలేటి జీఎం కా ర్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. ఏరియాలోని కైర్‌గూడ ఓసీపీ 3.50 లక్షల టన్నులకు గాను 98శాతంతో 3.44 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు.
ఏరియాలోని గోలేటి ఓసీపీ, ఎంవీకే ఓసీపీ గనుల ప్రారంభానికి కసరత్తు జ రుగుతున్నదన్నారు. గోలేటి ఓసీపీ ఏడాదిలోగా ప్రారంభమవుతుందని, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. కొత్త ఓసీపీ ప్రారంభమైతే బెల్లంపల్లి ఏరియాకు పూర్వ వైభవం వస్తుందన్నారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఏరియా డీజీఎం(పర్సనల్) రాజేంద్రప్రసాద్, డీజీఎం(ఐఈడీ) యోహానా, పీఎం లక్ష్మణ్‌రావు, డీవైపీఎం తిరుపతి పాల్గొన్నారు.
శ్రీరాంపూర్, జూన్ 1 : శ్రీరాంపూర్ డివిజన్లో మే నెలకు సంబంధించి 6,16,500 టన్నుల లక్ష్యానికి గాను 7,08,949 టన్నుల బొగ్గు ఉత్పత్తి (115 శాతం) సాధించినట్లు ఏరియా జీఎం సంజీవరెడ్డి తెలిపారు. మే నెలలో ఆర్కే-5 గని 110 శా తం, ఆర్కే-6 గని 113 శాతం, ఆర్కే-7 88 శాతం, ఆర్కే న్యూ టెక్ 121 శాతం, ఎస్ఆర్పీ-1 91 శాతం, ఎస్ఆర్పీ-3 95 శాతం, ఐకే-1ఏ 85 శాతం ఉత్పత్తి సాధించినట్లు వెల్లడించారు.
భూగర్భ గనుల్లో 99 శాతం ఉత్పత్తి సాధించిన ట్లు చెప్పారు. శ్రీరాంపూర్ ఓసీపీలో 99 శాతం, ఐకే ఓసీపీలో 176 శాతం బొగ్గు వెలికి తీసినట్లు వివరించారు. అ లాగే ఏరియాలో బొగ్గు రవాణా 100 శాతం సా ధించామన్నారు. అతిపెద్ద ఏరియాగా శ్రీరాంపూర్‌లో 9,600 మంది కార్మికులు ఉన్నారని చె ప్పారు. శ్రీరాంపూర్ ఓసీపీలో ఉ త్పత్తి పెంచడానికి స్థల సేకరణ పూర్తి చేసినట్లు వివరించారు. డిసెంబర్ నాటికి నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మందమర్రి రూరల్, జూన్ 1 : సమష్టి కృషితోనే బొగ్గు ఉ త్పత్తి సాధ్యమని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. జీఎం కార్యాలయంలో బుధవారం వివరాలు వెల్లడించారు. కేకే-1 గని 10,100 టన్నులకు, 11054 టన్నులు (109) శాతం ఉత్పత్తి సాధించిందన్నారు. అలాగే కేకే-5 గని 17,000 టన్నుల లక్ష్యానికి గాను, 14,280 టన్నులు (84 శాతం) సాధించినట్లు చెప్పారు. మందమర్రి ఏరియా గనులు, ఓసీలు కలిపి మే నెలలో 88 శాతం ఉత్పత్తి నమోదు చేసుకున్నాయని పేర్కొన్నారు.
స్థానిక సింగరేణి పాఠశాల మైదానంలో నిర్వహించే ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జీఎం పిలుపునిచ్చారు. మైదానంలో భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సాయంత్రం హైదరాబాద్ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్వోటూ జీఎం గోపా ల్ సింగ్, పీఎం వరప్రసాద్, ఐఈడీ రాజన్న తదితరులున్నారు.