సోన్, జూన్ 1: యాసంగిలో పండించిన వరి ధాన్యం కొనుగోళ్లను త్వరతగతిన పూర్తిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం నిర్మల్ మండలం వెంగ్వాపేట్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో ధాన్యం నిల్వలు, తూకం వేసిన, సేకరించాల్సిన ధాన్యం ఎంత ఉందని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు పడకముందే కొనుగోళ్లను పూర్తి చేయాలని, లారీలను సెంటర్‌కు పంపి ధాన్యం బ్యాగులను వెంట వెంటనే గోదాముల తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాంబాబు, ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ ప్రభాకర్, సర్పంచ్ గంగయ్య, ఉప సర్పంచ్ సవితాచిన్నయ్య, టీఆర్ఎస్ నాయకులు కొప్పుల నర్సయ్య, కర్రోల్ల చిన్నయ్య ఉన్నారు.
సారంగాపూర్, జూన్ 1: ఆలూర్‌లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూకం చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ఇక్కడ అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్బీఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వంగ రవీందర్‌రెడ్డి, నిర్మల్ ఎంపీపీ సామ రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మాధవరావు, ఆలూర్ సొసైటీ చైర్మన్ మాణిక్‌రెడ్డి, నాయకులు దండు సాయికృష్ణ, పతాని భూమేశ్, నర్సారెడ్డి, లక్ష్మీనారాయణ, రాజ్‌మహ్మద్, గ్రామస్తులు ఉన్నారు.