ఎదులాపురం, జూన్ 1: తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జనార్దన్‌రెడ్డి గార్డెన్లో బిల్డింగ్, పెయింటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమక్షంలో పలువరు యూనియన్ నాయకులు టీఆర్ఎస్లో చేరగా గులాబీ కండువాకప్పి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతున్నాయని చెప్పారు. త్వరలో బిల్డింగ్, పెయింటర్స్ యూనియన్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పట్టణాధ్యక్షుడు అజయ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, కౌన్సిలర్లు అశోక్ స్వామి, భరత్, టీఆర్ఎస్ నాయకులు రాంకుమార్, యోగేశ్, దమ్మ పాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 3 నుంచి 18 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పట్టణ ప్రగతి కార్యక్రమంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలను రూపొందించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా, మున్సిపల్ కమిషనర్ ఆదుముల్ల శైలజ, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడే, వార్డుల ప్రత్యేకాధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
జైనథ్, జూన్ 1: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బుధవారం పెండల్వాడలో మన ఊరు- మన బడి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.69లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పెండల్వాడ చెరువు నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం సాంగ్వి (కే)లో కోదండరామాలయానికి భూమిపూజ చేశారు. క్యాక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఎస్. లింగారెడ్డి, జిల్లా డైరెక్టర్ తల్లెల చంద్రయ్య, సర్పంచ్ ఊశన్న, విఠల్‌రెడ్డి, సురేశ్, ఎంఈవో నారాయణ, ఎంపీటీసీ అశోక్, హెచ్ఎం సూర్యకాంత్, ఎస్ఎంసీ చైర్మన్ స్వామి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.