సోన్, మే 30 : నిర్మల్, సోన్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను అధి కారులు వేగవంతం చేశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 31వ తేదీ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ఆలస్యంగా ధాన్యం తీసుకొస్తున్నా త్వరగా కొనుగోలు చేస్తు న్నారు.
ఇప్పటికే వెంగ్వాపేట్, చిట్యాల్, నీలాయి పేట్, మంజులాపూర్, ముఠాపూర్, న్యూవెల్మల్, సోన్, పాక్పట్ల, తదితర గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ సెంటర్ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ను ఏర్పాటు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే తూకం వేసి రైస్‌మిల్లులకు తరలి స్తున్నారు. మరో వారం రోజుల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కొను గోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని ఏ రోజుకారోజు రైస్ మిల్లులకు తరలిస్తున్నారు.
ఈ ప్రక్రియను పీఏసీఎస్ చైర్మన్లు, ఏపీఎంల ఆధ్వ ర్యంలో సీసీలు ధాన్యం వివరాలను ఎప్పటిక ప్పుడు ట్యాబ్‌లో నమోదు చేస్తున్నారు. తద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూస్తున్నారు. మరో ఐదు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు.