శ్రీరాంపూర్, మే 30 : సింగరేణి స్థలాల్లో నివాసముంటున్న వారందరికీ పట్టాలు ఇస్తామని, పంపిణీని పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు ఆర్కే-6 గుడిసెలు హిమ్మత్‌నగర్, కటికె దుకాణాలకు చెందిన 170 మంది లబ్ధిదారులకు చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్‌తో కలిసి సోమవారం సింగరేణి స్థలాల ఇండ్ల పట్టాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.
ప్రజల్లోకి రాని, ప్రజల కష్టాలు చూడని నాయకుల ప్రలోబాలకు లోనుకావద్దని సింగరేణివాసులకు సూచించారు. ఈ పట్టాలతో లబ్ధిదారులకు శాశ్వత హక్కు కలిగిందన్నారు. ఇక నుంచి ప్రతి ఒక్కరూ పక్కా ఇండ్లు కట్టుకోవచ్చని తెలిపారు. ఇండ్ల పట్టాలతో ఇంటి స్థలాలకు విలువ పెరుగుతుందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లోని ఇండ్ల స్థలాలను రెవెన్యూ డిపార్ట్మెంట్కు సింగరేణి యాజమాన్యం అప్పగించలేదని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పట్టాలు కల్పించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
శ్రీరాంపూర్, నస్పూర్‌లలో 2,840 ఇండ్ల పట్టాలు ఇస్తున్నట్లు చెప్పారు. జాతీయ రహదారి నిర్వాసితులు 220 మందికి 80 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇచ్చినట్లు చెప్పారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు మేకల దాసు, బండి పద్మ, పూదరి కుమార్, పంబాల గంగాఎర్రయ్య, నాసర్, కుర్మిల్ల అన్నపూర్ణ, ప్రకాశ్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి మేరుగు పవన్, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రా వు, మాజీ సర్పంచులు గుంట జగ్గయ్య, జక్కుల రాజేశం, నాయకులు చెల్ల విక్రమ్, కాటం రాజు, మహేందర్, రఫీక్‌ఖాన్, పెర్క సత్తయ్య, బోనాసి స్వామి, ప్రవీణ్, కొండపర్తి లహరిక, రవీందర్, రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
సుందరయ్యనగర్, శ్రీరాంపూర్ కాలనీల్లో గల సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న తమకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే దివాకర్‌రావు కౌన్సిలర్ పూదరి కుమార్, మేకల దాసు వినతి పత్రం సమర్పించారు. సింగరేణి యాజమాన్యం పట్టాలు ఇవ్వకుండా అడ్డుకుంటుందని చెప్పారు.