దస్తురాబాద్, మే 30 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజిపేటకు చెందిన వంగలా సాయి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాలో రూ.కోటి జమ కావడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆదివారం ఉదయం 7:59 గంటలకు రూ. 1,27,07,978 జమ అయినట్లు సాయి సెల్‌ఫోన్‌కు మెస్సేజ్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే నగదును వేరే ఖాతాకు బదిలీ చేస్తే అవలేదు. బ్యాంక్ అధికారులు తన ఖాతాను ఫ్రీజ్ చేసినట్లు తెలిపాడు. కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసే క్రమంలో ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.