కాగజ్‌నగర్‌టౌన్, మే 29 : కాగజ్‌నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం బల్దియాల అభివృద్ధి కోసం చేపట్టిన పట్టణ ప్రగతితో అన్ని శాఖల అధికారులు వా ర్డుల్లోని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంతేగాకుండా పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు గోడలపై వాల్‌పెయింటింగ్, సందేశాత్మక చిత్రాలను వేశారు. వా ర్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపడుతున్నారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి పూల మొ క్కలను నాటారు. వేసవి కావడంతో ప్రత్యేకంగా మొక్కలకు నీరు పోస్తున్నారు.
పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి రాజీవ్‌గాం ధీ చౌరస్తా వరకు రూ. 50 లక్షలతో సెంట్రల్ లై టింగ్ ఏర్పాటు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పూల మొక్కలను నా టి సంరక్షణ కోసం ఎప్పకటిప్పుడు చర్యలు చేపడుతున్నారు. ప్రధాన రోడ్డుకు ఇరువైపులా గోడలపై సందేశాత్మక చిత్రాలు తెలంగాణ రాష్ట్ర పం డుగ బతుకమ్మ, రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు, బా ల్యం నలిగిపోతుంది-బడికి పంపిద్దాం, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్‌ను నివారిద్దాం వంటి సందేశాత్మక చిత్రాలను వేశారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జికి రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు. ఇరువైపులా ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు ప్రత్యేకంగా ఆకర్షించేలా రంగు రంగుల లైట్లు ఏర్పాటు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ము న్సిపాలిటీల అభివృద్ధికే పట్టణ ప్రగతి కార్యక్రమా న్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా వార్డు ల్లో రోడ్లు, డ్రైనేజీలు, వి ద్యుత్‌తో పాటు ఇతర సమస్యలను గుర్తించి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
-సీవీఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్, కాగజ్‌నగర్