నిర్మల్ అర్బన్, మే 26 : ఇంటర్మీడియట్ మూల్యాంకనాన్ని పకడ్బందీగా చేపట్టాలని డీఐఈ వో పరుశరాం ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్ మూల్యాంకన కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. గురువారం అర్ధశాస్త్రం, భౌతిక శాస్త్రం అధ్యాపకులకు మూల్యాంకనాన్ని ప్రారం భించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ ను తనిఖీ చేశారు. అధ్యాపకులు చేపట్టిన మూల్యాం కనాన్ని గమనించారు. 85 శాతం మంది అధ్యా పకులు మూల్యాంకనానికి హాజరవుతున్నా రని విధులకు గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకుం టామని ఆయన పేర్కొన్నారు. ఈయన వెంట సత్యపాల్ అద్యాపకులు తదితరులున్నారు.
దస్తురాబాద్, మే 26 : మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో పది పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా విద్యా శాఖాధికారి రవీందర్‌రెడ్డి, డిప్యూటీ తహ సీల్దార్, (సిట్టింగ్ స్వాడ్) శివ కుమార్ తెలిపారు. గురువారం పది పరీక్షలను డీఈవో పరిశీలిం చారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల మధ్య పశ్నపత్రాలను ఓపెన్ చేస్తున్నామని పేర్కొన్నారు.మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నా మన్నారు.
ఏలాం టి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా, బయట వ్యక్తులు రాకుండా పరీక్ష కేంద్రం చుట్టూ 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు. విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయా లని సూచించారు. ఆయన వెంట ఎంఈవో మధుసూదన్, చీఫ్ సూపరింటెండెంట్ రాజేశ్వర్ గౌడ్, డీవో డీఎల్ ఎన్ చారి, సీఆర్పీ తిరుపతి పాల్గొన్నారు.