బేల, మే 23 : మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్య మరింత బలోపేతం అవుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ పేర్కొన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని బెదోడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలను తలదన్నే రీతిలో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రారంభించే అవకాశం ఉన్నందున విద్యార్థులను ప్రభుత్వ బడులకు పంపాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బాలేరావు అర్చన, ఎంపీటీసీ బేబితాయి, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, మండలాధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, నాయకులు తన్వీర్ఖాన్, తేజ్రావ్, మధుకర్, బాలేరావ్ ఎంపీడీవో భగత్ రవీందర్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు , తదితరులు పాల్గొన్నారు.