దహెగాం మే 23 : రేపు ఆ యువకుడి పెండ్లి.. అంతలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన మోర్ల రాజు (25) కు తన మేన మరదలితో ఈనెల 25న వివాహం నిశ్చయించారు. రాజు ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తండ్రి రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకొని మద్యం ఎందుకు తాగావు అని మందలించాడు.
దీంతో మనస్తాపం చెందిన రాజు భోజనం చేసిన అనంతరం గ్రామసమీపంలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఫోన్లో కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని రాజును స్థానిక పీహెచ్‌కీ తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం ప్రైవేట్ వాహనంలో కాగజ్‌నగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు పేర్కొన్నారు. రాజు తండ్రి పోశన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సనత్‌కుమార్ తెలిపారు.