పదో తరగతి పరీక్షలకు సమయం ఆసన్నమైంది. రేపటి(సోమవారం) నుంచే ప్రారంభంకానుండడంతో అధికారయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 209 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 39,080 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తుండగా.. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడకుండా ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టనున్నారు. విద్యార్థులు హాల్‌టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అధికారులు సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిర్మల్ అర్బన్, మే 21 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేపటి నుంచి ( సోమవారం) పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 23 నుంచి 29 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల వ్యాప్తంగా మొత్తం 39,080 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
అత్యధికంగా ఆదిలాబాద్‌లో 64 పరీక్షా కేంద్రాలు, అత్యల్పంగా కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 39 ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లాలో 48, మంచిర్యాలలో 58 చొప్పున కేంద్రాల్లో అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల పకడ్బందీ నిర్వహణ కు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. సెకండరీ బోర్డు ఆదేశాల మేరకు ప రీక్షా కేంద్రాల్లో విద్యుత్ సదుపాయం, ఫ్యాన్లు, కేం ద్రం బయట తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చే శారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఏఎన్ఎంను అందుబాటులో ఉంచనున్నారు. అనారోగ్యానికి గురైతే రెస్ట్ తీసుకునేందుకు గదులను సిద్ధం చేయనున్నారు.
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు తమ హాల్ టికెట్లను కండక్టర్‌కు చూపిస్తే సరిపోతుంది. సదరు కేంద్రం వద్ద వారిని దింపుతారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలను సైతం అందుబాటులో ఉంచారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాస్ కాపీయింగ్‌ను పూర్తిగా అరికట్టేలా అధికారులు ఇప్పటికే కఠిన ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చూడాలని కలెక్టర్లు, ఎస్పీలతో విద్యాశాఖ అధికారులు సమావేశాలు ని ర్వహించారు. ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెం ట్లు, డిపార్ట్మెంట్ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేయడంతో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నారు.
జిల్లాలోని ప్రతి పరీక్షా కేంద్రంలో 144 సెక్షన్ అమలు పర్చనున్నారు. జిల్లాల వారీగా ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు నిత్యం తనిఖీలు నిర్వహిస్తాయి. ఇందులో తహసీల్దార్, ఎస్ఐ స్థాయి అ ధికారి, విద్యాశాఖ అధికారులుంటారు. నిర్మల్ జిల్లాలో ఐదు సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను అధికారులు గుర్తించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కలిపి మొత్తం 39,080 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందులో అత్యధికంగా ఆదిలాబాద్‌లో 11,304 మంది, అత్యల్పంగా కు మ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 7,373 మంది వి ద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఈ సారి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో బాలికలు 19,758 మంది, బాలురు 19,322 మంది ఉన్నారు.
ఈ లెక్కన బాలుర కంటే బాలికలే 436 మంది అధికంగా ఉన్నారు. పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ చొప్పున మొత్తం 209 మందిని ని యమించారు. వీరితో పాటు డిపార్ట్మెంట్ అధికారులు, 1900 మంది ఇన్విజిలేటర్లు, పరీక్షా కేం ద్రంలో 300 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉంటే అదనపు డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే ప్రతి జిల్లాలో ఒక కంట్రోల్ రూంను ఏర్పాటు చే శారు. ఇప్పటికే విద్యార్థులకు హాల్‌టికెట్లను పంపిణీ చేశారు.