ఎదులాపురం, మే 29 : రైతులను ఇబ్బంది పెట్టినా, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని కలెక్టరేట్లో జొన్నల కొనుగోళ్లు, రవాణా, గోదాముల నిర్వహణ, హమాలీల కేటాయింపులపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జొన్నల కొనుగోలుతో పాటు రవాణా, అన్ లోడింగ్ ప్రక్రియ యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు. సరిపడా లారీలను సమకూర్చాలని, గోదాముల వద్ద హమాలీల సంఖ్య పెంచాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్.చిత్రూ, రాజేశ్వర్, మార్ ఫెడ్ డీఎం మహేశ్ కుమార్, మారెటింగ్ అధికారి గజానంద్, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా కార్మిక శాఖ అధికారి ముత్యం, సీడబ్ల్యూసీ మేనేజర్ రవి, ట్రాన్స్పోర్ట్, హమాలీ కాంట్రాక్టర్లు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు