ఎదులాపురం, మే 1: కార్మికులు తమ హకులతో పాటు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకానగర్‌లోని మేస్త్రీ సంఘం భవనంలో మే డే (అంతర్జాతీయ కార్మిక దినోత్సవం) వేడుకలను ఘనంగా ని ర్వహించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి కలెక్టర్ ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంఘాల భవనాల నిర్మాణం, కార్మికుల సమస్యల పరిష్కారం, అసంఘటితరంగ కార్మికుల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.
అనంతరం కార్మికులకు శిక్షణ అందిస్తున్న పలువురు సిబ్బందికి ప్రశంసా పత్రం, మెమెంటోను అందజేశారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయి డ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారాం, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రాజేశ్వరి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందన్ కుమార్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, ఐటీఐ ఏటీవో ఆర్.శ్రీనివాస్, మేస్త్రీ సంఘం అధ్యక్షుడు బండారి పోశన్న, సామల సత్యనారాయణ, రమేశ్, ఇతర అధికారులు, సిబ్బంది, మేస్త్రిలు, కార్మికులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, మే 1 : కార్మికులు తమ వృత్తిలో నైపుణ్యాలను పెంచుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. నిర్మల్ కలెక్టరేట్లో శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ అభివృద్ధికి కార్మికులే చోదక శక్తి అని అన్నారు. నైపుణ్యాలు ఉన్న కార్మికులకు విదేశాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో పాటు, వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌కు కార్మికులు జ్ఞాపికను అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ముత్యం రెడ్డి, కార్మిక శాఖ అధికారి రాజలింగు, ఉపాధి కల్పన అధికారి విజయలక్ష్మి, కోటి రెడ్డి తదితరులున్నారు.