
భీంపూర్, ఏప్రిల్ 25: కరంజి(టీ), పిప్పల్‌కోటి, భీంపూర్ గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. ఉదయం, సాయంత్రం గంట మాత్రమే దుకాణాలు తెరుస్తున్నారు. కరంజి(టీ) -మహారాష్ట్ర చిట్టెల నాగాపురం సరిహద్దులో కంచె ఏర్పాటు చేశారు. పెన్‌గంగ ఒడ్డున ఉన్న గుబ్‌డి, గోముత్రి, అంతర్గాం, వడూర్, గొల్లగఢ్, తాంసి(కే) గ్రామాల వారు మహారాష్ట్ర నుంచి ఎవరూ రాకుండా కట్టడి చేస్తున్నారు. కరంజి(టీ), భీంపూర్‌లో స్వచ్ఛంద లాక్డౌన్ పొడిగించే ప్రయత్నం చేస్తామని సర్పంచ్‌లు స్వాతిక, మడావి లింబాజీ తెలిపారు.
బోథ్, ఏప్రిల్ 25: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మండల కేంద్రంలో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. ఆదివారం మధ్యాహ్నం నుంచి వ్యాపారులు దుకాణాలు మూసి వేశారు. మరో వారం పాటు లాక్డౌన్ కొనసాగించాలని గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు అందరూ దుకాణాలు మూసి వేసి సహకరించాలని సర్పంచ్ సురేందర్‌యాదవ్ కోరారు.