గ్రామాల్లో పనులు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు
సద్వినియోగం చేసుకోవాలని కూలీలకు సూచన
సారంగాపూర్, ఏప్రిల్ 5 : నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో సోమవారం ఉపాధి పనులు షురూ అయ్యాయి. ఈ సందర్భంగా ఆయా చోట్ల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, నాయకులు ప్రారంభించారు. వేసవి సమీపించడంతో ప్రజలు పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు.
మండలంలోని వంజర్లో ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలూర్ పీఏసీఎస్ చైర్మన్ మాణిక్‌రెడ్డి, సర్పంచ్ లస్మయ్య, అడెల్లి దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు కొరిపెల్లి రాజు, గ్రామస్తులు, కూలీలు పాల్గొన్నారు.
దిలావర్పూర్, ఏప్రిల్ 5 : దిలావర్పూర్, సిర్గాపూర్ గ్రామాల్లో సర్పంచ్‌లు ఇట్టడి గంగారెడ్డి, వీరేశ్‌కుమార్ అధికారులతో కలిసి ఉపాధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో అజీజ్‌ఖాన్, ఎంపీటీసీ గంగవ్వ, ముత్యంరెడ్డి, ఈవో భూపాల్‌రెడ్డి, కారోబార్ రాజు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
కుభీర్, ఏప్రిల్ 5 : మండలంలోని జాంగాం గ్రామంలో సర్పంచ్ ముజాహిద్ఖాన్ భూమి పూజ చేసి, ఉపాధి పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాన్కుర్ గణేశ్, మాజీ ఉప సర్పంచ్ ఎం సంజీవ్, కే సంజీవ్, శివ, ఉస్మాన్‌ఖాన్, రమేశ్, పండారి, లతీఫ్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
దస్తురాబాద్, ఏప్రిల్ 5 : మండలంలోని దేవునిగూడెం గ్రామస్తులతో కలిసి సర్పంచ్ ముష్కే అంజన్న ఉపాధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, టీఏ వినోద్, నాయకులు, యువకులు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.
తానూర్, ఏప్రిల్ 5 : మండలంలోని కోలూర్, బొల్సా గ్రామాల్లో ఉపాధిహామీ పనులను మండల పరిషత్ ఉపాధ్యక్షుడు జెల్లావార్ చంద్రకాంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోలూర్ రైతు బంధు సమితి అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, బొల్సా సర్పంచ్ విఠాబాయి, కోలూర్ కార్యదర్శి సహేందర్, ఉప సర్పంచ్ యోగేశ్, కారోబారి నర్సారెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.
కడెం, ఏప్రిల్ 5 : మండలంలోని మాసాయిపేట, సారంగాపూర్ గ్రామాల్లో సర్పంచ్‌లు మెలుగూరి రాముగౌడ్, మేకల రాజారెడ్డి ఉపాధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో వార్డు సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మణచాంద, ఏప్రిల్ 5 : మండలంలోని చామన్‌పెల్లి, బోరిగాం, వడ్యాల్ గ్రామాల్లో ఉపాధి పనులను స్థానిక సర్పంచ్‌లతో జడ్పీటీసీ ఓస రాజేశ్వర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చామన్‌పెల్లి సర్పంచ్ పడిగెల గంగాధర్, వడ్యాల్ సర్పంచ్ అట్ల లలిత, బోరిగాం సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ గుజ్జారి గణేశ్, ఎంపీడీవో మోహన్, ఏపీవో దివ్య పాల్గొన్నారు.
కుంటాల, ఏప్రిల్ 5 : మండలంలోని విట్టాపూర్ గ్రామంలో ఉపాధి పనులను సర్పంచ్ గల్లాపురం లక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్ రెడ్డి, కార్యదర్శి కవిత, సిబ్బంది ఉన్నారు.